twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటి ప్రియాంక మరణం వెనుక చీకటి కోణం.. నలిగిపోతున్న టీవీ తారలు!

    By Rajababu
    |

    ప్రముఖ టెలివిజన్ నటి ప్రియాంక ఆత్మహత్య ఘటన తమిళ టెలివిజన్, సినీ వర్గాలనే కాకుండా దక్షిణాది వినోద పరిశ్రమను కుదిపేసింది. గత బుధవారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ప్రియాంక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సబర్న ఆనంద్, సాయి ప్రశాంత్, రాధిక రెడ్డి లాంటి తారలు ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ సందర్బంగా గతంలో సూసైడ్ చేసుకొన్న బుల్లి తెర తారల విషయం మళ్లీ వెలుగులొకి వచ్చింది. అయితే బుల్లితెర తారలు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడటం వెనుక ఉన్న చీకటి కోణంపై షాకింగ్ గురిచేస్తున్నది.

    Recommended Video

    చెన్నైలో నటి ప్రియాంక ఆత్మహత్య
     ప్రియాంకకు కుటుంబ సమస్యలా?

    ప్రియాంకకు కుటుంబ సమస్యలా?

    బుల్లితెరపై పాపులర్ నటిగా రాణించిన ప్రియాంక కుటుంబ సమస్యల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు ఫ్యామిలీపరంగా సమస్యలు లేవని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో తారలపై ఆంక్షలు ఉన్నట్టు దిగ్భ్రాంతికరమైన వార్త వెలుగు చూసింది.

     టీవీ తారలపై ఆంక్షలు!

    టీవీ తారలపై ఆంక్షలు!

    ఏదైనా సీరియల్‌లో నటించే ముందు నిర్మాతలు విధించే కొన్ని నిబంధనలకు లోబడి వారు ఉండాల్సి ఉంటుందట. సీరియల్స్‌లో కీలకపాత్రలు పోషించే హీరోయిన్లు గానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులపై మాతృత్వ నిషేధ ఒప్పందాలు ఉంటాయట. ఒకసారి అగ్రిమెంట్ సంతకం చేస్తే పిల్లలు కనకుండా ప్రొడక్షన్ సంస్థలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాల్సిందేనట.

     గర్భం దాల్చకూడదట!

    గర్భం దాల్చకూడదట!

    ఎవరైనా తారలు చేసుకొన్న అగ్రిమెంట్‌కు విరుద్ధంగా గర్భం దాల్చితే రెమ్యునరేషన్లలో కోత పెట్టడం లేదా పూర్తిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన సంఘటనలు చాలానే ఉంటాయంటున్నారు. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు తమ శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలట. అంతే కాకుండా స్థూలకాయం బారిన పడకుండా ఉండాలని నిర్మాణ సంస్థలు హెచ్చరిస్తాయట.

     నలిగిపోతున్న తారలు

    నలిగిపోతున్న తారలు

    ఇలాంటి నిబంధనల నడుమ ప్రియాంక నలిగిపోయిందట. పెళ్లై మూడేండ్లు గడిచిన పిల్లలకు కాకపోవడంతో భర్త అరుణబాలతో విభేదాలు తలెత్తాయట. దాంతో వారిద్దరూ విడి విడిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారనేది సన్నిహితుల సమాచారం. ఆ మానసిక వేదనతోనే ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    నటీనటుల సంఘం స్పందించాలి

    నటీనటుల సంఘం స్పందించాలి

    ప్రియాంక ఆత్మహత్య నేపథ్యంలో బుల్లితెర నటీనటుల, నిర్మాతలు స్పందించాల్సిన అవసరం ఉందని కొందరు పేర్కొంటున్నారు. సీరియల్స్‌లో నటించే తారలకు ప్రధానంగా హీరోయిన్లకు మానసిక స్థైర్యం కలిగించేలా కౌన్సెలింగ్‌ అవసరముందని పలువరు పేర్కొంటున్నారు. అలాంటి చర్యలను బుల్లితెర నటీనటుల సంఘం చేపడితే ప్రియాంక లాంటి వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా అడ్డుకట్ట వేయవచ్చు అని చెబుతున్నారు.

    ప్రియాంక కేసులో విచారణ

    ప్రియాంక కేసులో విచారణ

    అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినందున ప్రియాంక కేసులో పోలీసులు తీవ్ర విచారణ చేపట్టారు. భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో చిన్న అనుమానం ఉన్నా పోలీసులు కేసును నిశితంగా పరిశోధిస్తున్నట్టు సమాచారం.

    English summary
    Tamil television industry has witnessed numerous deaths. Popular Tamil television actor Priyanka allegedly committed suicide at her Valasaravakkam residence in Chennai on Wednesday morning. The actor hung herself from a fan at her home and was found dead by her domestic worker. After her death, so many issues coming out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X