'రాశి'తో ఒక రాత్రి
ఒకప్పటి ప్రముఖ కథానాయిక రాశి, ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. కథానాయికగా సక్సెస్ అయిన రాశి తన భర్త నివాస్ ను దర్శకుడిగా నిలబెట్టాలని 'మహా రాజశ్రీ' అనే సినిమాని తీసి నిర్మాతగా అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు రాశి.
ప్రస్తుతం మరో సారి నిర్మాతగా, తన భర్త నివాస్ దర్శకత్వంలోనే ఓ సినిమా తీయాలన్నకుంటున్న రాశి ఈ మధ్యనే 'సంతోషం ఫిల్మ్ ఫేర్ అవార్డుల' కార్యక్రమంలో తలుక్కుమని మెరిసింది. ఫైనాన్సియర్స్ కోసం ప్రయత్నిస్తున్న రాశి, ఈ ప్రయత్నాల్లో ఓ నిర్మాతని సంప్రదించగా ఆయన ఓ కోస్తా ఆంధ్రకు చెందిన ఎమ్మెల్యే ను కలవమన్నారు. దీంతో గంపెడంత ఆశలో ఆయన్ను సంప్రదించిన రాశికి ఊహించని షాక్ ఎదురయ్యింది. ఫైనాన్స్ చెయ్యడానికి ఒప్పుకున్న ఆయన రాశిని తనతో పాటు ఓ వారం రోజులు గడపమని కోరినట్టు తెలిసింది. అలా అయితేనే ఫైనాన్స్ చేస్తానని తేల్చిచెప్పినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











