30 వేల కోట్ల బిగ్‌షాట్‌ని పట్టిన రియా చక్రవర్తి .. కారులో బాయ్‌ఫ్రెండ్‌తో దొరికిన సుశాంత్ లవర్

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా నటీనటుల ప్రేమ వ్యవహారాలు, డేటింగ్స్, బ్రేకప్స్, ఎంగేజ్‌మెంట్స్, పెళ్లి వార్తలే కనిపిస్తున్నాయి. సినీతారలు అన్నాక ఎఫైర్స్ సహజం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్, దివంగత స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా వార్తల్లో నిలిచారు. ఇన్నాళ్లు కోర్టు కేసులు, సీబీఐ, ఈడీ చుట్టూ తిరిగిన వ్యవహారాలే వెలుగు చూశాయి. తాజాగా రియా చక్రవర్తి ప్రేమ యవ్వారం బయటికి వచ్చింది.

సీరియల్స్ , మోడల్‌గా తన స్వయంకృష్టితో బాలీవుడ్‌లో ఎదుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ప్రతిభావంతుడైన ఈ నటుడు, ఎంతో భవిష్యత్తు ఉండగానే బలవన్మరణానికి పాల్పడటం ఎంతో మందిని విషాదంలోకి నెట్టింది. 2020 జూన్ 14న ముంబైలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఆ వెంటనే పోలీసులు, దర్యాప్తు బృందాలు ఆగమేఘాలపై దర్యాప్తు ప్రారంభించారు.

Actress Rhea Chakraborty and Zerodha s Nikhil Kamath have been the subject of dating rumors

ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని .. సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. అలాగే సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రియా కుటుంబ సభ్యులు రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారని సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ రంగాన్ని , అభిమానులను షాక్‌కు గురిచేశాయి. ఆయన ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

అంతేకాదు.. సుశాంత్‌కు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు మాదక ద్రవ్యాలు ఇచ్చేవారంటూ ఆరోపణలు వినిపించాయి. ఎన్నో చిక్కుముడులు ఉండటం, సరికొత్త విషయాలు తెరపైకి రావడంతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీబీఐ , ఈడీలు తమ పని తాము చేసుకుంటూ పోవడంతో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత రియా, షోవిక్, వీరి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిలు విదేశాలకు వెళ్లకుండా సీబీఐ గతంలోనే లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది.

Actress Rhea Chakraborty and Zerodha s Nikhil Kamath have been the subject of dating rumors

సీబీఐ ఆదేశాలపై రియా, ఆమె కుటుంబ సభ్యులు బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం వీరికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే దీనిపై గతేడాది మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత ధర్మాసనం సమర్ధించింది. ఇక సినిమాల విషయానికి వస్తే 2021 తర్వాత రియా చక్రవర్తి ఏ సినిమాలోనూ నటించలేదు. చివరిసారిగా అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ కాంబోలో వచ్చిన చెహ్రెలో రియా చక్రవర్తి నటించింది. అయితే 2023లో ఎంటీవీ రోడీస్ : కామ్ యా కాండ్‌ ద్వారా బుల్లితెరపై అలరించింది.

అయితే రియా చక్రవర్తి మరోసారి ప్రేమలో పడినట్లుగా బీటౌన్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. జెరోదా కో ఫౌండర్ , 30 వేల కోట్ల సంపన్నుడైన నిఖిల్ కామత్‌తో రియా డేటింగ్ చేస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి కారులో పలుమార్లు జంటగా కనిపించడంతో వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అలాగే గోవాలో రియా - నిఖిల్‌లు జంటగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్లుగా మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్పేనా? లేక రిలేషన్‌లో ఉన్నది ఆసక్తిగా మారింది. అయితే నెటిజన్లు మాత్రం వీరి బంధంపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: rhea chakraborty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X