విడాకుల బాటలో రవితేజ హీరోయిన్? 46 ఏళ్ల వయసులో షాకింగ్ డెసిషన్
టాలీవుడ్ టూ బాలీవుడ్ ఏ ఇండస్ట్రీ చూసినా విడాకుల వార్తలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు? ఎవరు? విడాకులంటూ బాంబు పేలుస్తారోనని సినీ వర్గాలు, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. నిన్న గాక మొన్న స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన భర్త సొహైల్ కతూరియా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. తొలుత ఈ వార్తలు పుకార్లకే పరిమితం కాగా.. పెళ్లి ఫోటోలు, భర్తతో ఉన్న ఫోటోలను హన్సిక తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్ విడాకులకు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఖడ్గంతో పేరు
ఆ నటి ఎవరో కాదు సంగీత.. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా వెలుగొందారు సంగీత. పెళ్లాం ఊరెళితే, ఖడ్గం, సంక్రాంతి, ఈ అబ్బాయి చాలా మంచోడు, శివపుత్రుడు తదితర చిత్రాల్లో సంగీత నటనను ఎవరూ మరిచిపోలేరు. దక్షిణాది ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే గాయకుడు క్రిష్‌ను పెళ్లాడి అభిమానులకు షాకిచ్చారు సంగీత. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం. 46 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో, హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతున్నారు సంగీత.

మహేశ్ సినిమాతో రీ ఎంట్రీ
పెళ్లి, పిల్లలతో కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగీత తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగ నటించిన సరిలేరు నీకవ్వరు సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నకు తల్లిగా సంగీత నటించారు. నటనతో పాటు కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఆ వెంటనే వచ్చిన మసూద అనే హార్రర్ చిత్రం సంగీతకు మరింత పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో సంగీత కీలకపాత్రలు పోషించారు. అలాగే బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
మీనాతో ఫ్రెండ్‌షిప్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సంగీత ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలు, ఇతర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ వయసులోనూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంటారు. స్నేహానికి ప్రాణమిచ్చే సంగీత తన సన్నిహితులు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో తాను ఎంతో క్లోజ్‌గా ఉండేవారితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు. ముఖ్యంగా సీనియర్ నటి మీనా, సంఘవి, మహేశ్వరిలతో సంగీతకు అనుబంధం ఉంది. కొద్దిరోజుల క్రితం 90స్ బ్యాచ్ అంతా ఒక్కచోటికి చేరి సందడి చేయగా ఈ కార్యక్రమంలో ఎంజాయ్ చేశారు సంగీత.
భర్తతో విడాకులు?
కెరీర్‌లో బిజీ అవుతున్న దశలో సంగీత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తన భర్త క్రిష్ నుంచి ఆమె విడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా క్రిష్, సంగీత మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ పేరును సంగీత మార్చడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. గతంలో దీనికి సంగీత క్రిష్ అని పేరు ఉండేది.. దీనిని ఇప్పడు సంగీత మార్చారు. దీంతో సంగీత- క్రిష్ త్వరలోనే విడిపోతున్నారని.. ప్రస్తుతం వీరి మధ్య పంచాయతీ నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











