శృతి హాసన్ బ్రేకప్‌కు కారణం ఇదా.. దానికి బలవంతం చేయడంతో: బయటపడ్డ నమ్మలేని నిజం
లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనదైన అద్భుతమైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. చూపు తిప్పుకోకుండా చేసే అందం, అద్భుతమైన నటనతో మెప్పించిన ఈ బ్యూటీ.. వరుస చిత్రాలతో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. అదే సమయంలో తన ప్రేమకథలతో నిత్యం దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శృతి హాసన్ ఇటీవలే తన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది. దానికి దానికి కారణం తెలిసింది. అదేంటో మీరే చూడండి!
టీనేజ్‌లోనే.. అలా మొదలు
టీనేజ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ సింగర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను కూడా రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ మెరిసింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా జర్నీని స్టార్ట్ చేసుకుంది.

సీనియర్లతో హిట్లు కొట్టింది
తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుసగా సినిమాలు చేసిన శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చింది. అయితే, ఈ మధ్య మాత్రం ఆమె సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో 'సలార్', బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి', చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' మూవీలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టింది.

ఫారెనర్‌తో ట్రాక్ నడిపింది
కొంత కాలంగా కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ అప్పట్లో విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, అతడిని కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసింది. వీళ్లంతా కలిసి ఓ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఆ సమయంలో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి అని టాక్ వచ్చిన వెంటనే వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు.

శాంతనుతో డేటింగ్ చేస్తూ
మైకేల్‌తో విడిపోయిన తర్వాత శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగించడం మొదలుపెట్టింది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తూనే ఉండేది. ఇందులో భాగంగానే తరచూ అతడితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేసింది. అలా శృతి అతడితో రెచ్చిపోతూ వార్తల్లో నిలిచేది.

పెళ్లి అనుకుంటే బ్రేకప్‌తో
శాంతను హజారికాతో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సుదీర్ఘ కాలంగా డేటింగ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే అతడితో కలిసి యమ రొమాంటిక్‌గానూ గడిపింది. ఈ విషయం కమల్ హాసన్‌కు కూడా తెలుసు. ఇక, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో శాంతనుకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది.

బ్రేకప్‌కు కారణం ఇదేనా
ప్రియుడు శాంతను హజారికాతో శృతి హాసన్ బ్రేకప్‌పై ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు అన్న దానిపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. శృతి హాసన్‌ను శాంతను పెళ్లి విషయంలో బలవంతం చేయడం వల్లే ఆమె బ్రేకప్ చెప్పినట్లు తాజాగా ఓ నమ్మలేని నిజం బయటపడింది. కెరీర్ కోసమే ఆమె ప్రేమను వదులుకుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











