twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ స్నేహ గర్భం దాల్చిందా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వెంకీ, రాధా గోపాళం, శ్రీరామదాసు, రాజన్న, ఉలవ చారు చిత్రాల్లో నటించిన హీరోయిన్ స్నేహ గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. 2015లో స్నేహ బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది. స్నేహ వివాహం తమిళ నటుడు ప్రసన్నతో 2012 మే 11న జరిగిన సంగతి తెలిసిందే.

    Actress Sneha Prasanna Pregnant With First Child!

    'అచ్చముండు అచ్చముండు' చిత్రం ద్వారా నటుడు ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, పెళ్లి ద్వారా ఓ ఇంటివారయ్యారు స్నేహ-ప్రసన్న దంపతులు. ఇరువైపుల పెద్దల అంగీకారంతో ఈ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కూడా స్నేహ తన నట జీవితాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

    ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రసన్న మాట్లాడుతూ...పెళ్లయిన తర్వాత స్నేహ సినిమాల్లో కొనసాగడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఆరునెలలు పోరాడి పెళ్లికి పెద్దలను ఒప్పించామని ప్రసన్న చెప్పారు. ప్రస్తుతం స్నేహ-ప్రసన్న దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది.

    English summary
    Film Nagar ources have informed that Star Heroine Sneha is expecting a baby in the first half of 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X