Pushpa 2: అల్లు అర్జున్‌కు హ్యాండిచ్చిన శ్రీలీల.. అంత డబ్బు ఇస్తానన్న నో అనేసిందా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ స్పందన దక్కింది. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో వంద కోట్లతో చరిత్రను సృష్టించింది. తద్వారా బన్నీ రేంజ్‌ను కూడా నేషనల్ రేంజ్‌కు పెంచేసింది. ఫలితంగా ఇప్పుడు దీని నుంచి వచ్చే సీక్వెల్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప ది రైజ్' మూవీ సక్సెస్ అవడంతో దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్నారు. అదే కాంబినేషన్‌లో అత్యంత హై రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక, ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ చాలా రోజుల క్రితమే మొదలు పెట్టేసింది. ఇలా ఇప్పటికే చాలా షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపుగా 50 శాతానికి పైగానే చిత్రీకరణ కూడా పూర్తైందని తెలిసింది.

మొదటి పార్టులో సమంత రూత్ ప్రభు చేసిన 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ' అనే స్పెషల్ సాంగ్ ఎంత క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పుడు 'పుష్ప ది రూల్' మూవీలో కూడా అదే రేంజ్ సాంగ్‌ను పెట్టబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికోసం ఎవరిని తీసుకుంటారు అన్నది మాత్రం సస్పెన్స్‌గానే మారిపోయిందని చెప్పాలి.
వాస్తవానికి 'పుష్ప ది రూల్' స్పెషల్ సాంగ్ కోసం ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఇందులో శ్రీలీల కనిపించబోతుందని, దీనికోసం చిత్ర యూనిట్ ఏకంగా ఆమెకు ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఆమె ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ పిల్ల ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వస్తున్న 'పుష్ప ది రూల్' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











