Sreeleela : సీక్రెట్‌గా ఫారిన్ ట్రిప్ .. శ్రీలీలతో ఉన్న ఆ కుర్రాడెవరు? ఏంటి సంగతి?
ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీలేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదలైతే అందులో ఒక్క భగవంత్ కేసరి మినహా మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. గుంటూరు కారం హిట్ అయినా క్రెడిట్ మొత్తం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలో శ్రీలీల నటిస్తున్నారు.
అందాల అరబోత కన్నా కథ, సినిమాలో తన క్యారెక్టర్‌కు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తానని చాలామంది హీరోయిన్ల మాదిరే శ్రీలీల చెబుతున్నారు. కానీ అలాంటి కథలు ఆమె దగ్గరికి రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో తన 23వ పుట్టినరోజును జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తోంది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ వంటి సినిమాలు చేసినా ఆమెకు కలిసి రాలేదు. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్, తమిళ్‌లో అజిత్‌తో గుడ్ బాడ్ అగ్లీలో నటిస్తోంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుని తీరా ఇక్కడ ప్లాపులు రాగానే కోలీవుడ్, మల్లువుడ్‌లపై భామలు చూస్తారని పేరు. ఈ మాటను నిజం చేస్తూ శ్రీలీల కూడా తమిళ్‌పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్‌లోనూ ఆమె ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీలీల నటిస్తున్న మూవీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. హీరోయిన్స్‌పై గాసిప్స్ సహజం.. అందులోనూ ఫామ్‌లో ఉన్న వారిపై ఇవి కాస్త ఎక్కువ. దానికి తగినట్లుగా శ్రీలీల ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ పుకార్లపై తక్షణం స్పందించిన శ్రీలీల.. అవన్నీ నిరాధారమని, ప్రస్తుతం తన దృష్టి సినిమాలు, కెరీర్‌పైనే ఉందని క్లారిటీ ఇచ్చింది. మధ్యలో వదిలేసిన చదువును పూర్తి చేయాలని భావిస్తున్నానని, అందుకే సినిమాలను కూడా తగ్గించినట్లుగా మొన్నామధ్య శ్రీలీల పేర్కొన్నారు. డాక్టర్ కావాలనేది తన డ్రీమ్ అని ఆమె పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అమ్మమ్మ వాళ్ల ఊరిలో ఆమె అనారోగ్యం కారణంగానే తాను డాక్టర్ కావాలని అనుకున్నట్లు శ్రీలీల తెలిపారు. షూటింగ్స్‌లో ఉన్నా పరీక్షలు ఉంటే రాత్రివేళల్లో చదువుకుంటానని చెప్పింది.
ఇదిలాఉండగా.. శ్రీలీల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో ఫారిన్ వెళ్తున్న ఫోటోలతో పాటు డిన్నర్ చేస్తున్న పిక్స్‌ను ఆమె షేర్ చేశారు. వాటిని బట్టి శ్రీలీల ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫ్లైట్ విండో నుంచి ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌ను నైట్ మోడ్‌లో గమనించవచ్చు. అలాగే ఈ ఫోటోల్లోని ఒక దానిలో శ్రీలీల ఎవరో కుర్రాడితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన ఎవరు..? శ్రీలీల సడెన్‌గా పారిస్ ట్రిప్ ఎందుకు వెళ్లింది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











