మంత్రి రోజాను టార్గెట్ చేసిన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్.. సన్నీలియోన్ అకౌంట్‌తో..

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, పోర్న్ స్టార్ సన్నీలియోన్.. మంత్రి, నటి రోజాను గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ విస్త్రృతంగా ప్రచారం అవుతున్నది. దానికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాళ్లోకి వెళితే..

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. నువ్వా నేనా అనంతగా అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి విజయ యాత్ర ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా.. అధికార పార్టీ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శలను గట్టిగానే తిప్పి కొడుతున్నారు.

Sunny leone

సన్నీలియోనిపై రోజా విమర్శలు..: అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా.. పవన్ కళ్యాణ్.. వైఎస్ భారతమ్మ ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నీ భర్తకు నువ్వు కాస్త సంస్కారం నేర్పించమ్మా.. లేదంటే నేను నేర్పిస్తాను అని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలపై మంత్రి రోజా గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌.. జగన్ కు సంస్కారం నేర్పిస్తాడంట. జగన్ స్వతహాగానే సంస్కారవంతుడు.. తండ్రికి తగ్గ తనయుడు ఆయన. పవన్ చెప్పింది ఎలా ఉందంటే.. సన్నీలియోన్ వేదాలు చెప్పినట్టుగా ఉంది అంటూ మంత్రి రోజా ఘాటు కామెంట్లు చేసింది. అయితే ఈ విమర్శల మధ్యలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, పోర్న్ స్టార్ సన్నీలియోనీని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

Sunny leone

సన్నీలియోని గట్టి కౌంటర్..: అయితే మంత్రి రోజా వ్యాఖ్యలపై సన్నీలియోన్ స్పందించినట్లు.. ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో దిమ్మతిరిగే కౌంటర్ ఉంది. రోజా విమర్శలు చేసిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. నేను పోర్న్ స్టార్ అయినందుకు నేనెప్పుడు పశ్చాత్తాప పడలేదు. ఎందుకంటే నేను ఏది చేసినా కూడా అది బహిరంగంగానే చేశాను. మీకు నాకు ఉన్న తేడా ఒకటే.. నేను ఆ ఇండస్ట్రీని వదిలేశాను.. మీరు ఇంకా వదలలేదు. అంటూ ఆ ట్వీట్ లో ఉంది. ఇప్పుడా ఆ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు.. దాన్ని తెగ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆ ట్వీట్ సన్నీలియోన్ అకౌంట్‌తో జనసేన కార్యకర్తలు చేసిన పనే అని నెటిజన్లు గుర్తించారు.

Sunny leone

ఫేక్ అకౌంట్...: ఇకపోతే ఈ ట్వీట్ పోస్ట్ చేసిన అకౌంట్ సన్నీలియోని పేరుతో ఉంది. కానీ ఇది అఫీషియల్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఆమెకు సంబంధించిన అఫీషియల్ ఇంకోటి కనిపిస్తూనే ఉంది. ఏదేమైనప్పటికీ ఆ వీడియోను జనసేన కార్యకర్తలు, అభిమానులు, నెటిజన్లు మాత్రం దాన్ని షేర్ చేస్తూ రోజాపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

Sunny leone

చేతిలో బోలేడు సినిమాలు...: ఇక సన్నీలియోని విషయానికొస్తే.. ఆమె తెలుగులో చివరిగా 'జిన్నా' చిత్రంతో ఆడియెన్స్ ను పలకరించారు. ఈ సినిమా ఆకట్టుకోలేదు. తమిళంలో 'ఓ మై ఘోస్ట్' చిత్రంతో రాగా అది కూడా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. 'కెన్నెడి', 'రంగీల', 'వీరమదేవి', 'షీరో', 'కోకా కోలా', 'హెలెన్', 'బ్యాటిల్ ఆఫ్ భీమా' వంటి చిత్రాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X