11 మందితో ఎఫైర్స్..!24 ఏళ్లకే తల్లి..ఇంకా పెళ్లి చేసుకోని బ్యూటీ?
సిని సెలబ్రెటీలకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితం గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఓ హీరోయిన్ ఏకంగా 11 మంది ప్రేమలో పడిందట. ఆమె ఇద్దరూ పిల్లలు కూడా తల్లి కూడా. కానీ, ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ బ్యూటీ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సినీ రంగుల ప్రపంచంలో చాలామంది సెలబ్రిటీలు .. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పిస్తునే ఉన్నారు. ఎనలేని ఫేమ్, మనీ సంపాదించుకుంటున్నారు. అలాగే కోట్లాది మంది గుండెల్లో చెరుగని ముద్ర వేసుకుంటున్నారు. కొంత మంది మాత్రం కెరీర్ లో ఎంత సక్సెస్ అయినా.. తమ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఫెల్యూర్ అవుతున్నారు. వ్యక్తిగత విషయాలతోనే ఎప్పుడు వార్తల్లో నిలిచారు.ప్రేమ, పెళ్లి, విడాకులు సెలబ్రిటీల జీవితంలో అవి సర్వ సాధారణం. ప్రేమలో విఫలమయ్యాక .. కొత్త జీవితం ఆరంభించిన హీరోయిన్స్ కొంతమంది ఉంటే.. మరికొందరూ మాత్రం ఒంటరిగానే ఉండిపోయి..జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఆ స్టార్ హీరోయిన్ ఎన్నో చిత్రాల్లో అద్బుతమైన పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఈ అమ్మడు అందానికి ప్రపంచమే ఫిదా అయింది. కొంతకాలం సిల్వర్ స్కీన్ పై అగ్ర కథానాయకగా ఓ వెలుగు వెలిగింది. అయితే.. ఆ సమయంలో ఎంతో మంది సీని సెలబ్రెటీలతో, ప్రముఖులతో, వ్యాపారవేత్తలతో ఆమె పేరు ముడిపడి ఉంది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 మందితో ప్రేమ వ్యవహారం నడిపించినట్టు ఇండస్ట్రీలో టాక్. అప్పట్లో బీ టౌన్ లో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతమందిని ప్రేమించినా ఏ ఒక్కరి ప్రేమను జీవితాంత పొందలేక పోయింది. వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. కానీ, ఆమె 24 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ సుష్మిత సేన్. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగొంది. కానీ, సుష్మితసేన్ వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ వార్తలో నిలుస్తుంది. సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఫెమినా మిస్ ఇండియా 1994 టైటిల్ అందుకున్న సుస్మితా సేన్ అదే ఏడాది మిస్ యూనివర్స్ టైటిల్ అందుకుంది. ఇలా మిస్ యూనివర్స్ టైటిల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా సుస్మిత సేన్ రికార్డు క్రియేట్ చేసింది.
ఆ తరువాత సుస్మిత సేన్ మోడలింగ్ నుండి నటిగా సిని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అలా.. దస్తక్ అనే సినిమాతో వెండి తెరపై కనిపించింది. ఆమె నటించిన తొలి సినిమానే హిట్ కావడంతో టాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చింది. తన రెండవ సినిమాలో కింగ్ నాగార్జునకు జంటగా నటించే అవకాశం కొట్టేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రక్షకుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఆ తరువాత.. తెలుగులో ఒకే ఒక్కడు మూవీలో సుస్మిత సేన్ చేసింది. ఈ ఐటెం సాంగ్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే.. నటిగా సుస్మిత సేన్ పెద్దగా ఫేమస్ కాలేదు. ఆమె ఐటెం గర్ల్ గా స్థిరపడ్డారు. చాలా సినిమాల్లో స్పెషల్ నెంబర్స్ చేసింది సుస్మితా సేన్. ఆమె కెరీర్ సక్సెస్ గానే ఉన్నా.. వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక సుస్మిత సేన్ ఎఫైర్స్ జాబితా చూస్తే.. చాలా పెద్దగానే ఉంటుంది. పలు రంగాల సెలబ్రెటీలతో ఆమె ఎఫైర్స్ కొనసాగించినట్టు టాక్. ఇందులో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ తో ఆమె కొన్నాళ్లు ఎఫైర్ కొనసాగించారనీ, ఇంతియాజ్ ఖత్రి, ముదస్సర్ అజీజ్, రణదీప్ హుడా, ఐపీఎల్ డాన్ లలిత్ మోడీతో పాటు పలువురితో ఆమెకు అఫైర్స్ ఉన్నాయని రూమార్స్ ఉన్నాయి. అయితే.. ఈ విషయాలపై ఎన్నాడు అధికారికంగా ప్రకటించలేదు. గతంలో మోడల్ రోహ్మాల్ షాల్ తో ఆమె ఎఫైర్ నడిపారనీ, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని
వార్తలు కూడా వచ్చాయి.
ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఈ అమ్మడుకు 11 మందితో ఎఫైర్ ఉన్నా.. సుస్మితా సేన్ ఎవరినీ వివాహం చేసుకోలేదు. కానీ, ఈ బ్యూటీ మాత్రం 2000లో తల్లి అయ్యింది. ఆ ఏడాది 6 నెలల పాపను దత్తత తీసుకుంది. రీనె సేన్ అని పేరు పెట్టింది. అలాగే 2010లో అలీషా అనే మరో పాపను కూడా దత్తత తీసుకుంది. ఇదెలా ఉంటే.. సుస్మిత సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్ లో నటిస్తూ.. సక్సెస్ పుల్ గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











