మహేష్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన నటి.. సోషల్ మీడియాలో రచ్చ !
సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ దశ షూటింగ్ దుబాయ్ లో పూర్తయింది. అయితే రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలుపెట్టాక కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే అనూహ్యంగా ఏ సినిమా వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఒక నటి. అదేంటి నటి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం ఏమిటి ? అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉండచ్చు.
కానీ అది నిజమే నారా రోహిత్ నటించిన సోలో, రాజు గారి గది 2, జంబలకడిపంబ, గీతగోవిందం, జోడి, రాహు శశి లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి అందరిని మెప్పించిన స్వప్నిక ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ లేని కారణంగా అభిమానులతో ఈమె ముచ్చట్లు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె సర్కారువారు పాట సినిమాకు సంబంధించిన పలు కీలక అంశాలు వెల్లడించింది.

ఈ సినిమా బిర్యానీ లా ఉండబోతోంది అని చెబుతూనే సినిమాలో మహేష్ ఎలాంటి స్పెషల్ లుక్ లో ఉండడు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ఒక నెటిజన్ సర్కారు వారి పాట టీజర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడగ్గా చేయొచ్చు ఏమో అంటూ సమాధానం ఇచ్చింది. మరొకరు అడిగిన ప్రశ్నకు కూడా ఇలాగే సమాధానం ఇవ్వడంతో కచ్చితంగా ఆ రోజు టీజర్ వస్తుందని భావిస్తున్నారు. ఇక స్వాప్నిక విషయానికి వస్తే ఆమె పరుశురాం దర్శకత్వంలో వచ్చిన సోలో, గీత గోవిందం సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











