తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి షాకింగ్‌గా!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే తమదైన హవాను చూపిస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు. చిన్న వయసులోనే హీరోయిన్‌గా కెరీర్‌ మొదలెట్టిన ఈ చిన్నది.. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూనే ఉంది. ఇలా ఇప్పుడు కూడా చేతి నిండా ఆఫర్లతో బిజీగా గడుపుతోంది. అదే సమయంలో తమన్నా ఓ నటుడితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని తాజాగా న్యూస్ లీకైంది. ఆ వివరాలను మీరే చూడండి!

టీనేజ్‌లోనే సెన్సేషన్‌గా
టీనేజ్‌లో ఉన్నప్పుడే తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 'శ్రీ' అనే మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ వెంటనే తమిళంలో 'కేడీ' ఫిల్మ్ చేసింది. అయినా 'హ్యాపీ డేస్' మూవీతోనే తమన్నా మొట్టమొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఒక్కసారిగా టాలీవుడ్‌లో సెన్సేషన్ అయింది.

Actress Tamannaah Bhatia To Be Mother Before Marriage

సినిమాలే కాదు వాటిలో
తెలుగు చిత్ర పరిశ్రమలో యమ హైలైట్ అయిన తర్వాత తమన్నా అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించింది. గతంలో మూవీలకే పరిమితమైన తమన్నా 'లెవెంట్ అవర్' వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి వెళ్లింది. తర్వాత 'నవంబర్ స్టోరీస్', 'లస్ట్ స్టోరీస్ 2', Jee Karda, Aakhri Sach సిరీస్‌లు చేసింది.

ఇప్పుడా మూవీలో బిజీ
ఆ మధ్య తమన్నా తెలుగులో F3, గుర్తుందా సీతాకాలం అనే చిత్రాలు చేసింది. గత ఏడాది చిరంజీవితో 'భోళా శంకర్', రజినీకాంత్‌తో 'జైలర్' మూవీలు చేసింది. వీటితో పాటు ఆమె హిందీలో 'భోలే చుడియాన్', మలయాళంలో 'బంద్రా', తమిళంలో 'అరన్మనై 4' వంటి సినిమాల్లోనూ నటించింది. ఇప్పుడు తెలుగులో 'ఓదెల 2' మూవీలో భాగం అయింది.

Actress Tamannaah Bhatia To Be Mother Before Marriage

నటుడితో డేటింగ్‌లోనే
చాలా ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న తమన్నా భాటియాపై ఎన్నో డేటింగ్ వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. అయితే ఇప్పుడామె ప్రముఖ నటుడు విజయ్‌ వర్మతో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఇద్దరూ ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి ఈ సినీ జంట తరచూ కలిసే కనిపిస్తున్నారు. దీంతో తరచూ వీళ్లిద్దరూ తెగ హైలైట్ అయిపోతోన్నారు.

పెళ్లి మాత్రం ఆలస్యం
తమన్నా భాటియా.. విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకుంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. అంతేకాదు ఫలానా నెలలో వీళ్లు ఒక్కటి అవబోతున్నారని టాక్ వచ్చింది. కానీ, అది మాత్రం జరగలేదు. అనివార్య కారణాల వల్ల వీళ్ల వివాహం అంతకంతకూ ఆలస్యం అవుతూనే వస్తోంది.

Actress Tamannaah Bhatia To Be Mother Before Marriage

తల్లి కాబోతుందంటూ
విజయ్ వర్మతో తమన్నా భాటియా ఏడు అడుగులు నడిచేది కన్ఫార్మ్ అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, అది ఎప్పుడు అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నా భాటియా త్వరలోనే తల్లి కావాలని నిర్ణయం తీసుకుందట. విజయ్ వర్మతోనే ఆమె మొదటి సంతానానికి జన్మనివ్వబోతుందని ఓ న్యూస్ కలకలం రేపుతోంది.

అలానా, డైరెక్టుగానా?
తమన్నా భాటియా తల్లి కావాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆమె డైరెక్టుగానే బిడ్డకు జన్మనివ్వబోతుందా? లేక సరోగసి పద్దతి ద్వారా తల్లి కావాలనుకుంటుందా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి ఈ వార్త తమన్నా అభిమానులతో పాటు సినీ ప్రియులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X