తమన్నా బ్రేకప్ వెనుక షాకింగ్ కారణాలు.. అతడితో అలాటి లవ్ మ్యాటరా?
స్టార్ కపుల్ తమన్నా భాటియా - విజయ్ వర్మలు విడిపోవడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడంతో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియక అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. ఎలాంటి బలమైన కారణం చేత ఈ జంట విడిపోవాల్సి వచ్చిందంటూ గడిచిన కొన్నిరోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రకరకాల కథనాలు ఇప్పటికే సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
లస్ట్ స్టోరీస్ 2 సమయంలో తమన్నా - విజయ్ వర్మలు ప్రేమలో పడ్డారు. నాటి నుంచి ఇద్దరూ కలిసే మూవీ ఈవెంట్స్‌కు, పార్టీలకు, ఫంక్షన్‌లకు చాటు మాటుగా వెళ్లేవారు. అయితే ఓ ఇంటర్వ్యూలో తాను విజయ్‌ని ప్రేమిస్తున్నట్లు తమన్నా ఓపెన్ అయ్యారు. విజయ్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో ఇక పబ్లిక్‌గానే చెట్టాపట్టాలేసుకుని కనిపించారు తమన్నా - విజయ్. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. టాలీవుడ్ టూ బాలీవుడ్ అందరూ పెళ్లి పీటలెక్కుతోన్న సమయంలో తమన్నా - విజయ్‌లు కూడా ఏదో ఒకరోజు గుడ్ న్యూస్ చెబుతారని అంతా అనుకున్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట విడిపోయారని.. బ్రేకప్ చెప్పుకున్నారని మీడియాలో, సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఇద్దరిలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం ఈ కథనాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయ్యింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట ఎందుకు విడిపోయిందంటూ కారణాలు వెతికేపనిలో ఉన్నారు జనాలు. అయితే తమన్నా పెళ్లి చేసుకోవాలని త్వరగా సెటిల్ అవ్వాలని భావిస్తుండగా.. విజయ్ మాత్రం కెరీర్‌పై ఫోకస్ పెట్టి తర్వాత వివాహాం చేసుకోవాలని అనుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వార్తలు వస్తున్నాయి.
విజయ్‌తో బ్రేకప్ వార్తల నేపథ్యంలో తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా .. ప్రేమ, పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన భాగస్వామిని ఎంచుకోవాలని యువతకు సూచించారు. అలాగే ప్రేమ జీవితంలో ఎదుటి వ్యక్తి మనకు కండీషన్స్ పెట్టడమంటే అది వ్యాపారమేనని తమన్నా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో విజయ్‌తో తన బ్రేకప్‌ను తమన్నా పరోక్షంగా చెప్పేశారని అంటున్నారు. అలాగే ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న ఫోటోలను తొలగించేశారు.

అయితే విజయ్ - తమన్నాల మధ్య ఇంకా ఏదో గట్టిగానే జరిగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే పాడ్‌కాస్ట్‌లో ప్రేమ, రిలేషన్‌లపై మిల్కీ బ్యూటీ హాట్ కామెంట్స్ చేశారు. ప్రేమ, రిలేషన్ విషయంలో మనమంతా గందరగోళానికి గురవుతామని, కానీ ప్రేమ అనేది హృదయానికి సంబంధించినదని.. దానికి ఎలాంటి కండీషన్స్ ఉండవని తమన్నా చెప్పారు. రిలేషన్‌షిప్ అనేది ఎలాంటి అంచనాలు లేకుండానే మొదలవుతుందన్నారు. తన దృష్టిలో ప్రేమ అనేది వన్ సైడేనని , నిజమైన ప్రేమలో అవతలి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందని, భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తమన్నా తెలిపారు. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











