విజయ్ వర్మతో బ్రేకప్.. 52 ఏళ్ల నిర్మాతతో క్లోజ్‌గా, ఫోటోలతో షాకిచ్చిన తమన్నా

రేపో మాపో పెళ్లి చేసుకుంటారని అనుకున్న తమన్నా భాటియా - విజయ్ వర్మ జంట అనూహ్య పరిణామాల మధ్య విడిపోయింది. వీరి మధ్య బ్రేకప్‌కు దారి తీసిన పరిస్ధితులు ఏంటనే దానిపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. మీడియా కథనాలకు తోడు ఎవరికి నచ్చిన విధంగా వారు ఏదేదో ఊహించుకుంటున్నారు. తమన్నా, విజయ్‌లు మాత్రం గతాన్ని పక్కనపెట్టి తమ రోజు వారి జీవితం, సినిమాలు, షూటింగ్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో తమన్నా భాటియాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

పెళ్లి చేసుకుని లైఫ్‌లో స్థిరపడాలని తమన్నా .. కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని విజయ్ పట్టుబట్టడంతోనే ఈ జంట మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయని బీటౌన్ టాక్. నేటి వరకు ఖచ్చితమైన కారణం తెలియకపోవడంతో చాలా మంది ఈ వాదననే నిజమని నమ్ముతున్నారు. బ్రేకప్ తర్వాత తమన్నా పలుమార్లు స్పందించగా.. విజయ్ మౌనంగానే ఉంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం .. ప్రేమ, పెళ్లి, రిలేషన్ అనే అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Actress Tamannaah Bhatia Photoshoot with Bollywood Producer karan johar Photos goes viral

తన దృష్టిలో రిలేషన్ అంటే ఒక ఐస్ క్రీమ్ అన్న విజయ్ .. జీవితంలో వచ్చే సుఖం, సంతోషం, బాధ, దు:ఖం ఇలా ప్రతి దానిని పరిపూర్ణంగా ఆస్వాదించాలని అన్నారు. బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్నిసార్లు కఠిన పరిస్ధితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని విజయ్ వర్మ స్పష్టం చేశారు. తమన్నా మాత్రం ప్రేమ వ్యాపారం కాకూడదని .. బంధంలో భాగస్వామికి కండీషన్స్ పెట్టకూడదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. భాగస్వామిని ఎంచుకునే విషయంలో సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని తమన్నా భాటియా పిలుపునిచ్చారు.

జీవితంలో కొత్త వ్యక్తులను కలవడం తనకు ఎంతో ఇష్టమని.. ఊహించని పరిస్ధితులు తనను ప్రభావితం చేయవని, నేను ఆనందించే విషయాలనే అందరికీ చెప్పగలనని మిల్కీబ్యూటీ కామెంట్స్ చేశారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఇది నాకు తోడ్పడుతుందన్నారు. ప్రస్తుతం తమన్నా భాటియా తెలుగులో ఓదెల-2లో నటిస్తున్నారు. అఘోరాగా ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చింది. ఓదెల- 2 ప్రమోషన్ కార్యక్రమాల్లో తమన్నా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - ముంబై మధ్య ఆమె షటిల్ సర్వీసులు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, సినిమాలు, ఇతర అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తారు తమన్నా. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో ఆమె ఫోటో షూట్ చేసింది. ఇందులో తమన్నా నడుముపై చేతులు వేసి మరీ ఫోటోకు ఫోజులిచ్చాడు కరణ్. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. తమన్నా అభిమానులు , నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X