శృంగార సీన్లల్లో తమన్నా బీభత్సం .. 30 నిమిషాలకే పారితోషికం ఎంతో తెలుసా?

స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓటీటీ వెబ్ సిరీసులతో అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడా చూసిన తమన్నా పేరు తెగ వినిపిస్తోంది. అందుకు కారణం ఇటీవల ఆమె చేసిన శృంగారభరిత సన్నివేశాలే. గత నెలలో జీ కర్దా (Jee Karda), లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) రెండు వెబ్ సిరీస్ లు విడుదల అయ్యాయి.

ఇందులో తమన్నా ఎన్నడూ కనిపించని విధంగా బోల్డ్ గా ఇంటిమేట్ సీన్లతో హీట్ పుట్టించింది. 18 ఏళ్ల కిస్సింగ్ రూల్ ను కూడా బ్రేక్ చేసి రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో తమన్నా తీసుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

Actress Tamannaah Bhatia Remuneration For Lust Stories 2 Intimate Scenes

విపరీతమైన క్రేజ్: శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ బ్యూటి తమన్నా.. హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఎవరికీ దక్కని క్రేజ్ సంపాదించుకుంది. యూత్ కు క్రష్ గా మారిపోయింది. దీంతో ఆమెకు తెలుగులో కుప్పలుతెప్పలుగా వరుస అవకాశాలు రావడం మొదలైంది.

Actress Tamannaah Bhatia Remuneration For Lust Stories 2 Intimate Scenes

18 ఏళ్లు-73 చిత్రాలు: కొంచెం ఇష్టం కొంచె కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బద్రీనాథ్, బాహుబలి: ది బిగినింగ్, బెంగాల్ టైగర్, ఊపిరి, బాహుబలి: ది కన్‌క్లూజన్, F2, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలతో అలరించింది గ్లామరస్ బ్యూటి తమన్నా. ఇండస్ట్రీకి వచ్చిన 18 ఏళ్లలో సుమారు 73కిపైగా చిత్రాల్లో నటించి అలరించింది ఈ సుందరి.

Actress Tamannaah Bhatia Remuneration For Lust Stories 2 Intimate Scenes

లస్ట్ స్టోరీస్ 2తో: ప్రస్తుతం తమన్నా భోళా శంకర్, జైలర్, బోలే చూడియా, బాంద్రా సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ఓటీటీ వెబ్ సిరీసులతో తెగ పాపులర్ అయింది ఈ మిల్కీ బ్యూటి. జూన్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జీ కర్దా (Jee Karda) అనే వెబ్ సిరీసులో శృతిమించిన శృంగార సన్నివేశాలతో తమన్నా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మళ్లీ ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2తో హీట్ పెంచేసింది.

Actress Tamannaah Bhatia Remuneration For Lust Stories 2 Intimate Scenes

బెడ్ రూమ్ సీన్స్: తమన్నా నటించి లేటెస్ట్ అంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో విడుదలై రచ్చ లేపుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా బోల్డ్ సీన్లలో నటించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. తన కెరీర్ లో ఎప్పుడు నటించని రీతిలో ఇందులో ఘాటు రొమాన్సు చేసింది తమన్నా. లిప్ కిస్ సీన్స్ తోపాటు బెడ్ రూమ్ సన్నివేశాలతో రెచ్చిపోయింది.

Actress Tamannaah Bhatia Remuneration For Lust Stories 2 Intimate Scenes

30 నిమిషాలకే: అయితే సాధారణంగా తమన్నా ఒక సినిమాకు రూ. 5 కోట్లు తీసుకుంటుందని టాక్. కానీ, లస్ట్ స్టోరీస్ 2 సిరీసులో శృంగార సన్నివేశాల్లో నటించినందుకు ముద్దుగుమ్మ తమన్నా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుందనే న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

ఈ అంథాలజీ సిరీసులో తమన్నా పాత్ర కేవలం 30 నిమిషాల నిడివిలోపే ఉంటుంది. ఈ నిడివిలో రొమాన్స్ సీన్స్ చేసేందుకు ఏకంగా రూ. 7 కోట్లు తీసుకుందట. ఇంటిమేట్ సీన్లలో నటించేదుకు తమన్నా ఎలాంటి అడ్డు చెప్పకుండా ఉండేందుకే మేకర్స్ అంతా ఇచ్చారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X