ఆయనతో ఆ మూడ్ లేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
Tamannah: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు భాషతో పాటు.. తమిళంలో కూడా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది మిల్క్ బ్యూటీ. మంచు మనోజ్ హీరోగా వచ్చిన 'శ్రీ' అనే మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తరువాత శేఖర్ కమలా డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' అనే మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది ఈ పాలబుగ్గాల సుందరీ. అప్పటినుంచి ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇండస్ట్రీలో దూసుకుపోయింది.
మరోపక్క తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ పిచ్చ క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇటీవల డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన బాక్ మూవీలో నటించింది. ఇంకా రజినీకాంత్ జైలర్ మూవీలో 'కావాలయ్యా..'అంటూ రెచ్చిపోయింది. గ్లామర్ షో తో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా మారింది. ఈ మధ్యనే స్ట్రీ 2 సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసి.. కుర్ర కారును చెమటలు పట్టించింది. ఇలా తెలుగుతో పాటు హిందీ సినిమాలలోనూ ఆఫర్లు అందుకుంటుంది.

నిజంగా ఈ మిల్క్ బ్యూటీ తమన్నా సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏండ్లు అవుతున్నా.. తమ గ్లామర్ చెక్కుచెదరలేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా స్టార్ హీరోయిన్ గా పాపులారిటీని సంపాదించుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఫోకస్ పెట్టింది. ఈ వెబ్ సిరీస్ తో తన అందాలు ప్రదర్శిస్తూ.. టాప్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఈ హాట్ బ్యూటీ.
ఇదిలా ఉంటే.. తమన్నా పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ బ్యూటీతో కెరీర్ ప్రారంభించిన కాజల్, నయనతార, రకుల్, సమంతలు ఇప్పటికే పెళ్లి చేసుకోగా.. మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మాత్రం సోలోగా లైఫ్ ను లీడ్ చేస్తుంది. కాగా.. తమన్నా ప్రేమ, పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటేర్ వైరలవుతోంది. గతేడాదిగా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఓ బాలీవుడ్ స్టార్ హీరోలో లవ్ ట్రాక్ నడుపుతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తమన్నా లవ్ ఎవరో కాదు.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో చాలా రోజులుగా డేటింగ్ చేస్తుందని టాక్. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో పలు హాట్ సోర్టీస్ సర్కిలేట్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న మిల్క్ బ్యూటీ తమన్నా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తాను మ్యారేజ్ చేసుకునే మూడ్‌లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తమన్నా-విజయ్ వర్మలు తర్వలో పెళ్లి పీటలు ఎక్కుతున్నారని భావించిన ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











