పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్ త్రిష.. వరుడు ఎవరంటే..?
అందాల తార త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోండి స్టార్ హీరోయిన్ రేసులో నిలబడింది. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించి ఆనతి కాలంలోనే నెంబర్ 1 పొజిషన్ కు చేరుకుంది. సీనియర్,జూనియర్ అని తేడా లేకుండ అందరితోనూ నటించి మెప్పించింది.
ఇక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తన సత్తా చాటింది. సినిమాల విషయం పక్కన పెడితే. త్రిషప్రేమాయణాలు లెక్కలేనేంత మందితో నడిపిందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. శింబు నుంచి ధనుష్ వరకు అమ్మడు నడిపిన ప్రేమాయణాలు గురించి కథలు కథలుగా చెప్పుకొస్తారు. మధ్యలో త్రిష వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పెళ్ళికి రెడీ అయింది.

2015ల వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ, కొన్ని రోజులకు వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో త్రిష ఎంగేజ్ మెంట్ ను కూడా క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత త్రిష పెళ్లి, లవ్ ట్రాక్ అంటూ తెగ వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి.
ఇక ఆ రూమర్స్ గురించి పట్టించుకోకుండా అమ్మడు కెరీర్ మీద ఫోకస్ చేసి 96 సినిమాతో రీఎంట్రీ గట్టిగా ఇచ్చింది. ఈ సినిమా తరువాత మరోసారి ఈ చిన్నది స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో బిజీగా ఉన్న త్రిష మరోసారి పెళ్లి పీటలు ఎక్కుతుందని వార్తలు గుప్పుమంటున్నాయి.
41 ఏళ్ల వయసులో త్రిష పెళ్లి పీటలు ఎక్కనుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఓ ప్రముఖ మలయాళ నిర్మాతతో త్రిష లవ్ ఎఫైర్ సాగిస్తుందని టాక్ వస్తోంది. అతనితో త్వరలో ఏడడుగులు కూడా వేయనుందని టాక్ నడుస్తుండగా.. వార్తలను త్రిష ఖండించింది.

" నాకు ఇప్పటికే చాలా సార్లు పెళ్లి చేసేశారు. ఈ ప్రపంచంలో నా పెళ్లి కన్నా ముఖ్యమైన వార్త ఇంకేదీ లేదన్నంతగా నా పెళ్లి వార్తలు రాస్తున్నారు. అయినా, నా పెళ్లికి ఇప్పుడప్పుడే తొందరేం వచ్చింది. నేను సంతోషంగా ఉన్నాను. ఇలా ఉండడం వలన ఎవరికేం నష్టం లేదుగా.. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు. పెళ్లి చేసుకొనే రోజు వస్తే కచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటాన " అని చెప్పుకొచ్చింది.
ఇక దీంతో త్రిష పెళ్లి రూమర్స్ కుచెక్ పడింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో త్రిష విశ్వంభర లో చిరు సరసన నటిస్తోంది. వీరిద్దరూ స్టాలిన్ సినిమాలో నటించి మెప్పించారు. చాలాకాలం తరువాత ఈ జంట కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాతో త్రిష టాలీవుడ్ రీఎంట్రీ ఏ రేంజ్ లో ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











