Breakup: టాప్ హీరోయిన్ బ్రేకప్.. భర్తతో విడాకుల దిశగా హాట్ బ్యూటీ!
Urmila Matondkar: సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రిటీలు ఎంత సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే సీక్రెట్ గా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. గత వారం తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ కూడా తన 8 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకోవాలనుకుంటుందట. ఇంతకీ ఆ టాప్ హీరోయిన్ ఎవరు? అసలేందుకు విడిపోవాలనుకుంటుంది? మీరో లూక్కేయండీ.
ఇటీవలి కాలంలో చాలా మంది సెలబ్రిటీలు చిన్నచిన్న విషయాలు, చిన్న చిన్న తగదాలను మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఎన్నో ఏండ్ల తన ప్రేమపూర్వక బంధానికి పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు. చాలా మంది విభేదాలతో విడాకులు తీసుకున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా మటోండ్కర్ (Urmila Matondkar) కూడా తన వివాహ బంధాన్ని తెంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ ఊర్మిళ భర్త మోసిన్ అక్తర్ మీర్ (Mohsin Akhtar Mir)నుంచి విడాకులు కావాలంటూ నాలుగు నెలల క్రితమే కోర్టుకు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో ఈ జంట తమ వివాహ బంధాన్ని ఎండ్ చేయాలనీ, భర్త నుంచి తనకు విడాకులు కావాలని ఉర్మిళ కోర్టు మెట్లు ఎక్కినట్టు సమాచారం. ఎందుకు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారో అనే విషయం ఇంకా బయటకు రాలేదు.

వాస్తవానికి ఊర్మిళ మటోండ్కర్, మోసిన్ అక్తర్ మీర్ వివాహం అప్పట్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. వీరిద్దరిది ఊ మతాంతర వివాహం.వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చర్చనీయం అంశంగా మారింది. దాదాపు 10 సంవత్సరాలు తన కంటే చిన్నవాడైన మోసిన్ అక్తర్ మీర్ ను హీరోయిన్ ఊర్మిళ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఫిబ్రవరి 4. 2016లో జరిగింది. వారు 8 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. అయితే .. విషయంపై ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ, స్పందన కానీ రాలేదు. ఇదిలాఉంటే.. హీరోయిన్ ఊర్మిళకు 50 ఏళ్లు కాగా.. ఆమె భర్త మోసిన్ అక్తర్ మీర్ కు 40 ఏళ్లే.
మొహ్సిన్ అక్తర్ మీర్ విషయానికి వస్తే.. అతను వ్యాపారవేత్త, మోడల్ కూడా. ఆ తరవాత నటనపై ఆస్తకితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2009లో 'ఇట్స్ ఎ మ్యాన్స్ వరల్డ్' సినిమాతో తొలిసారి నటుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'బీఏ పాస్', 'లక్ బై ఛాన్స్', 'ముంబై మస్త్ ఖలందర్' వంటి సినిమాలు చేశాడు. అయితే.. ఈ మూవీస్ తో అంతగా గుర్తింపు రాకపోవడంతో.. తిరిగి తన వ్యాపారాలపై మీద దృష్టి పెట్టారని సమాచారం. వాస్తవానికి ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ పెళ్లిలో ఊర్మిళ మటోండ్కర్, మోసిన్ అక్తర్ మీర్ తొలిసారి ఒకరికొకరు పరిచయమన్నట్టు టాక్. ఆ తర్వాత ప్రేమ. రెండేళ్ల ప్రేమ తర్వాత సీక్రెట్ గా గోల్డెన్ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు.

ఇక ఊర్మిళ మటోండ్కర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం లేదు. అంతం, గాయం, అనగనగా ఒక రోజు సినిమాల్లో నటించింది. అలాగే.. 'మనీ మనీ' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో స్పెప్టులేసింది. కానీ బ్యూటీకి రంగీలా అనే సినిమాతో తెగ క్రేజ్ వచ్చింది. ఇలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మరో సారి ఊర్మిళ మటోండ్కర్ తన కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంపై ఊర్మిళ గానీ, ఆమె భర్త మొహ్సిన్ అక్తర్ మీర్ ఏదైనా ప్రకటన చేస్తే తప్ప ఈ విషయంలో క్లారిటీ రాదు.


Click it and Unblock the Notifications











