వరలక్ష్మీ శరత్​ కుమార్ చేసుకునేది పెళ్లైనోడినా - విస్తుపోయే నిజాలు బయటకు!

తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రేక్షకులకు పరిచయమే. అయితే ఎట్టకేలకు 40ఏళ్ల వయసుకు చేరువ అవుతున్న సమయంలో పెళ్లికి రెడీ అయింది ఈ భామ. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఫొటోలను అఫీషియల్​గా షేర్ చేసింది. అయితే ఇప్పుడామె పెళ్లి చేసుకోబోయేవాడి గురించి విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అతడు రెండో పెళ్లి వాడని కూడా తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

మొదట హీరోయిన్​గా కెరీర్ ప్రారంభించినా సక్సెస్​ కాలేక విలనిజాన్ని ఎంచుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్​. తనకు హీరోయిన్​ పాత్రలు సెట్​ అవ్వక క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా మారి లేడీ విలన్​గా మస్త్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్​ అనగానే మొదటగా తనే గుర్తొచ్చే విధంగా నటనతో ఆకట్టుకుంది.

Actress Varalaxmi Sarathkumar Fiance Nicholai Sachdev is Already Married Person News Goes Viral

ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ ఆ తర్వాత జిమ్​కు వెళ్లి మరీ కష్టపడి బరువు తగ్గింది. అనంతరం నాజూకుగా మారి ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే తన పాత్రల సెలక్షన్​లోనూ వైవిధ్యం చూపించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ప్రొఫెషనల్ లైఫ్ గురించి పక్కనపెడితే పర్సనల్​ లైఫ్​ ఆమె గురించి ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఆమె రిలేషన్ స్టేటస్​ గురించి వార్తలు గుప్పుమన్నాయి. హీరో విశాల్​తో వరూ ప్రేమాయణం నడిపిందని, కానీ శరత్ కుమార్ వల్ల ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని ప్రచారం సాగింది.

ఇక ఆ తర్వాత రీసెంట్​గా తమిళ స్టార్ హీరో శింబుతో పెళ్లికి రెడీ అయిందని కూడా రూమర్స్ వచ్చాయి. అంతా నిజమని నమ్మేశారు కూడా. కానీ ఆ తర్వాత ఇది కూడా అసత్యమేనని తేలింది. తాము మంచి స్నేహితులమని పుకార్లను కొట్టి పారేశారు. అయితే తాజాగా తన ఎంగేజ్ మెంట్ పిక్స్ పెట్టి ఒక్కసారిగా సర్​ప్రైజ్ అంట్ షాక్​కు గురి చేసింది. నికోలయ్‌ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ ఓనర్​తో పెళ్లికి రెడీ అయింది. వీరిద్దరికి 14 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు చెబుతున్నారు.

దీంతో అతడి బ్యాక్​గ్రౌండ్ ఏంటని తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు? అతడిని చూసి విలన్​లా ఉన్నాడని కూడా కామెంట్లు చేస్తున్నారు? అయితే అలా ఆరా తీసే క్రమంలో నికోలయ్​కు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. నికోలయ్​కు అంతకుముందే పెళ్లి అయ్యినట్లు తెలిసింది. నికోలయ్‌ మాజీ భార్య పేరు కవిత సచ్ దేవ్. ఆమె ఒక మోడల్ అని సమాచారం అందింది. ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోందట. కానీ వీరిద్దరికి మనస్పర్థలు రావడం వల్ల విడాకులు తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు షాక్ అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ చేసుకోబోయేది పెళ్లైనోడినా? రెండో భార్యగా అతడి దగ్గరికి వెళ్తుందా? అంటూ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X