అల్లు అర్జున్ పై సెటైర్లు వేస్తుందట

By Srikanya

హైదరాబాద్: పూరీ జగన్నాథ్ చిత్రం హార్ట్ ఎటాక్ తో పరిచయమైన అదా శర్మ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామె అల్లు అర్జున్ కి సెటైర్స్ వేయటానికి సిద్దమవుతోందని సమాచారం. అయితే నిజ జీవితంలో మాత్రం కాదు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కోసం ఆమె పాత్రను త్రివిక్రమ్ స్పెషల్ గా డిజైన్ చేసారని సమాచారం.

అదా శర్మ పాత్ర క్రేజీగా, ఫన్ తో ఎప్పుడూ ఎవరో ఒకళ్లపై సెటైర్స్ వేస్తూ సాగుతుందిట. పనిలో పనిగా అల్లు అర్జున్ పై కూడా వేస్తుందిట. అయితే దానికి అల్లు అర్జున్ ఇచ్చే రిటార్ట్ లు ఇంకా ఫన్ గా ఉంటాయంటున్నారు. త్రివిక్రమ్ ఇలాంటి సెటైర్స్ డైలాగ్స్ రావటంలో దిట్ట కాబట్టి ఆ పాత్ర బాగా జనానికి పడుతుందని భావిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో ఉపేంద్ర నెగిటివ్ పాత్ర చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్ర నెగిటివ్ కాదని..ప్యారలల్ గా సాగే పాత్ర అని సినిమాలో మరో లీడ్ క్యారెక్టర్ లాంటిదని తెలుస్తోంది. అందుకే ఉపేంద్ర ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

Adah Sharma fun role in Arjun film

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ మరోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. చాలా కాలం నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కావటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు.

ఇదివరకు 'జులాయి'తో సందడి చేసిన ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సినిమాకు చాలా రోజుల క్రితమే కొబ్బరికాయ కొట్టేశారు. వచ్చే నెలలో చిత్రీకరణ అన్నారు. అయితే రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఈ లోగా అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం, యాడ్స్ అంటూ బిజీ అయ్యారు. ఈలోగా త్రివిక్రమ్ చిత్రం స్క్రిప్టుకు పూర్తి స్ధాయిలో మెరుగులు దిద్దారు.

ప్రస్తుతం ఉపేంద్ర చేస్తున్న పాత్రకు గానూ...జగపతిబాబు, అర్జున్‌ పేర్లనూ పరిశీలించారు. చివరికి ఉపేంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన సమంతతో పాటు ప్రణీత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని సమాచారం. స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X