Don't Miss!
- News భక్తులకు గుడ్‌న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచు విష్ణు సరసన హార్ట్ ఎటాక్ బ్యూటీ?
హైదరాబాద్: శివాజీ గణేశన్ మనవడు, ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు హీరోగా నటించిన తమిళ చిత్రం 'అరీమా నంబి' ఇటీవల విడుదలై, ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని కలైపులి థాను నిర్మించారు. 'అరీమా నంబి' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో ఈ చిత్రాన్ని మంచు విష్ణు-దేవా కట్టా కాంబినేషన్లో రీమేక్ చేయబోతున్నారు. 'ఆటోనగర్ సూర్య' తర్వాత దర్శకుడు దేవా కట్టా చేయబోయే చిత్రం ఇదే. తాజా వార్తల ప్రకారం పూరిజగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన 'హార్ట్ ఎటాక్' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఆదాశర్మకు ఈ చిత్రంలో దక్కిందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'త్రిశూలం' చిత్రంలో ఓ హీరోయిన్ గా నటిస్తున్న ఆదాశర్మ, 'గరం' చిత్రంలో ఆది సరసన నటిస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన 'అరిమా నంబి'లో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఆనంద్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట ప్రేక్షకాదరణ పొందటంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మంచు విష్ణు సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. దేవాకట్ట చేస్తున్న తొలి రీమేక్ చిత్రం ఇదే.
ఓ కిడ్నాప్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. గర్ల్ ఫ్రెండ్ ఆహ్వానంపై ఆమె ఇంటకి వెళ్లిన హీరో, అనుకోకుండా ఆమె కిడ్నాప్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ అమ్మాయి తండ్రి తన కూతురు కిడ్నాపే కాలేదంటాడు. తాగి తప్పుడు కేసు పెట్టాడని పోలీసులు హీరోనే అనుమానిస్తారు. ఆఖరికి ఈ వ్యవహారం ఓ టీవీ చానెల్ యజమాని, ఎస్‌డి కార్డు, కేంద్ర మంత్రి, ఓ మోడల్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. చివరకు ఏమయిందన్నది మిగిలిన కథ.