'అధినాయకుడు'లో చిరుపై వ్యంగ్యంగా ఆ డైలాగు?
మొన్న రచ్చ చిత్రంలో రామ్ చరణ్ తేజ...ఏదో చూసుకుని తొడలు కొట్టే టైపు కాదు నేను అంటూ ఓ డైలాగు వేసిన సంగతి తెలిసింది. అది డైరక్ట్ గా నందమూరి హీరోలను ఉద్దేశించే అని అందరి భావన. ఈ నేఫద్యంలో చిరంజీవి పై బాలకృష్ణ రాబోయే చిత్రం అదినాయకుడులో ఓ రేంజిలో డైలాగులు వేసాడని తెలుస్తోంది. అవి సూటిగా,ఘాటుగా ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో ఉంటోంది. సినిమా రిలీజయ్యాక అవి హాట్ టాపిక్ అవుతాయి అనటంలో సందేహం లేదు అంటున్నారు. సినిమల్లో పెట్టారంటూ చెప్పుకుంటున్న డైలాగుల్లో మచ్చుకు ఒకటి ...
'సొంత ఊరి జనం 'ఛీ'గొట్టే వంశం నీది...రాష్ట్రం మొత్తం నీరాజనాలు పలికిన వంశం మాది...ఆల్రెడీ పద్నాలుగు పళ్ళూ గొట్టా...మిగిలిన 18 కూడా ఊడగొట్టమంటావా?'
ఇలాంటి డైలాలుగు సినిమాలో చాలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ ఈచిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. ఇందులో ముసలి గెటప్‌లో ఉండే బాలయ్య పాత్ర...పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తుందని, ఆయనపై ఇండైరెక్టుగా రాజకీయ విమర్శలు చేస్తారని తెలుస్తోంది. ఆ మధ్య బాలయ్య మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పదవుల కోసం ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని విమర్శించడం, చిరంజీవి స్పందిస్తూ బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమా ద్వారా చిరుపై విమర్శల రివేంజ్ తీర్చుకుంటున్నారని అంటున్నారు.
మరో ప్రక్క బాలకృష్ణ సైతం ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దూకుతానంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏ పొలిటికల్ పార్టీని టార్గెట్ చేస్తోంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే ఈ చిత్రం గురించి చెపుతూ దర్శకుడు పరుచూరి మురళి.. ఎక్కడో ఎవరో నిర్ణయాలు తీసుకోవాలి. అవి ఆచరణలోకి రావాలి. ఆ తరవాతే జనం సమస్యలు తీరాలి... ఈ విధానానికి తిలోదకాలు ఇవ్వాలన్నది ఆ పెద్దాయన సిద్ధాంతం. సమస్య మనదే అయినప్పుడు, దాన్ని పరిష్కరించుకొనే అధికారం కూడా మనదే కావాలంటాడు.
ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే ఆయన ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? తన సిద్ధాంతాలతో ప్రజల్ని ఎలా చైతన్యం చేశాడన్నది తెర మీదే చూడమంటున్నారు. ఇది విన్నవారికి బాలకృష్ణ ఏ పార్టీని లక్ష్యంగా పెట్టుకుని చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్దం అవుతుందని చెప్తున్నారు.
జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ బాలయ్య మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్, నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరి, దర్శకత్వం: పరుచూరి మురళి.


Click it and Unblock the Notifications











