బాలకృష్ణ సినిమాకి ఆర్ధిక ఇబ్బందులా?
బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు కి ఆర్దిక ఇబ్బందులు చుట్టుముట్టాయంటూ ఫిల్మ్ నగర్ వార్తలు గుప్పుమంటున్నాయి. మీడియా కూడా ఇదే విషయమై ఇప్పటికే వార్తలు ప్రచురించింది. వారు చెప్పే దాని ప్రకారం ఈ చిత్రంకి ఫైనాన్సియర్స్ వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, అనుకన్న బడ్జెట్ కన్నా ఎక్కువైందని అందుకే రిలీజ్ వాయిదా పడుతోందని చెప్తున్నారు. దాదాపు పదికోట్ల రూపాయలు వరకూ ఈ చిత్రం బయిటపడాలంటే అవసరమని చెప్తున్నారు. అయితే చిత్రం టాక్ మాత్రం బయిట చాలా పాజిటివ్ గా ఉండటం కలిసి వచ్చే అంశం. బాలకృష్ణ మూడు గెటప్ లు కూడా అదిరిపోయాయని,పెద్ద సినిమాలకు ఫైనాన్స్ సమస్యలు కామన్ అని,బాలకృష్ణలాంటి సినిమాకు ఆర్దిక ఇబ్బందులు వచ్చినా అది కొద్ది రోజులేనని,అంతగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఓ వర్గం అంటోంది. పరుచూరి మురళి ఈ చిత్రాన్ని మంచి కసితో మూడు పాత్రలకూ డిఫెరెంట్ షేడ్స్ ని ఇచ్చి, నేటి రాజకీయాలని టార్గెట్ చేస్తూ తీసారని చెప్తున్నారు.
బాలకృష్ణ సైతం ఈ చిత్రం విడుదలపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. సినిమా విడుదల అయ్యితే సింహా ని దాటిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్,స్టిల్స్ అంతటా సంచలనం క్రియేట్ చేసాయి.ఇక నిర్మాత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..'బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. నటుడిగా బాలయ్యను మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ సినిమా. బాలయ్య సినిమా సరైన విజయాన్ని అందుకుంటే... దాని ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో ఇప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా చిత్రాలు నిరూపించాయి. వాటిని మించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఎంతో నమ్మకంతో చెప్పగలను అన్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











