ఫ్యాన్స్ ని నిరాశపరుస్తున్న బాలకృష్ణ
బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడు చిత్రం సంక్రాంతికి విడుదల కావటం లేదు. మరో పదిహేను రోజులు పాటు వాయిదా పడే అవకాసం కనిపిస్తోంది. దాంతో బాలయ్య అభిమానులు నిరాశ చెందుతున్నారు. మొదటి నుంచీ సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొడదామనుకున్న బాలయ్యకు ధియోటర్స్ సమస్యతో వెనక్కి తగ్గారని సమాచారం. ఈ సంక్రాంతికి తెలుగులో ఆరు సినిమాలు విడుదలకు రంగం సిద్దమైంది..వాటిలో ఐదు స్ట్రైయిట్ సినిమాలు కాగా, మిగతా ఒకటి డబ్బింగ్ చిత్రం. ఆ వివరాలు..
ది బిజినెస్ మ్యాన్ జనవరి 11,2012
బాడీగార్డ్ జనవరి 12,2012
నిప్పు జనవరి 12,2012
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ జనవరి 14,2012
త్రీ రాస్కెల్స్ (డబ్బింగ్) జనవరి 14,2012
పూల రంగడు జనవరి 14,2012
దాంతో ఇప్పుడు ఈ పోటీలో ఉండి.. సరైన ధియోటర్స్ దొరకక ఏదో ఒక ధియోటర్స్ లో రిలీజ్ చేయటం కన్నా కొద్ది రోజులు ఆగటం బెస్ట్ అని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.
balakrishna the business man body guard nippu బాలకృష్ణ అధినాయకుడు ది బిజెనెస్ మ్యాన్ బాడీగార్డ్ నిప్పు


Click it and Unblock the Notifications