ఆది పురుష్: సీత పాత్ర కోసం మరో హీరోయిన్.. ఆ రూమర్స్ నిజం కాదట
రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న సినిమాల్లో ఆది పురుష్ ఒకటి. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో రామాయణ కథ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.
ఇక సీత పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. మొదట కీర్తి సురేష్, నయనతార పేర్లు గట్టిగానే వినిపించాయి. కానీ బాలీవుడ్ లో మార్కెట్ చాలా కీలకం కాబట్టి ఈ స్టార్స్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశం లేదని అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆ తరువాత కబీర్ సింగ్ బ్యూటీ కీయరా అద్వానీ సెలెక్ట్ అయ్యిందనే గాసిప్స్ కూడా వచ్చాయి.

ఇక ఇప్పుడు ఊర్వశి రౌతేలా అనే మరో పేరు వైరల్ అవుతోంది. నిజానికి చిత్ర యూనిట్ సీత పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ ని పరిశీలించారు. కానీ ఎవరూ కూడా సెట్టవ్వడం లేదని కొత్త హీరోయిన్ పైనే స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు నిజమో తెలియదు కాని ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. కానీ వీలైనంత త్వరగా సీత పాత్రపై క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు ఓం రావత్ ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











