Don't Miss!
- Sports
SAT20 : విల్ జాక్స్ ఊచకోత.. చిత్తుగా ఓడిన ఎంఐ!
- News
Jaggareddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Adipurush Release date దర్శకుడిని దారుణంగా ట్రోల్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్!
దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న ప్రభాస్ తో అవకాశం వచ్చింది అంటే ఏ దర్శకుడు కూడా అంత తేలిగ్గా తీసుకోడు. సినిమా ఆడిన ఆడకపోయినా ఏదో ఒక విధంగా ఆకట్టుకునే విధంగా దర్శకులు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేసిన ఆదిపురుష్ సినిమా అవుట్ ఫుట్ విషయంలో అయితే దారుణంగా నిరాశపరిచినట్లే అనిపిస్తోంది.
ఇక దర్శకుడు అప్డేట్స్ ఇవ్వడంలో అలాగే సినిమాకు ప్రమోషన్స్ చేయడంలో కూడా ఎలాంటి ప్రణాళికతో లేకపోవడం కూడా ఫ్యాన్స్ కు కోపాన్ని తెప్పిస్తోంది. ఇక రీసెంట్ గా అతను అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ కూడా మళ్లీ సోషల్ మీడియాలో ఎగబడ్డారు. ఆ వివరాలలోకి వెళితే..

రెండు సినిమాలకు అలాంటి టాక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత డిఫరెంట్ సినిమాలను లైన్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు వచ్చిన సాహో సినిమా ఓవర్గం ప్రేక్షకులకు బాగానే నచ్చింది. అలాగే లవ్ అడ్వెంచర్ మూవీగా వచ్చిన రాధే శ్యామ్ కూడా దారుణంగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్నప్పటికీ అందులో ఉండే కొన్ని సీన్స్ మాత్రం ఓవర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఆదిపురుష్ పై ముందే అనుమానాలు
అయితే ఆదిపురుష్ సినిమా విషయంలో మాత్రం ఓం రౌత్ పై తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే అందరికి ఒక క్లారిటీ వచ్చింది. సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ఆడియన్స్ షాక్ అయ్యారు. అసలు గ్రాఫిక్స్ ఏమిటి అని ఆడియన్స్ అయితే దారుణంగా కామెంట్ చేశారు. చిన్నపిల్లల కార్టూన్స్ కు సంబంధించిన గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి అని అసలు దర్శకుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా సినిమాను డిజైన్ చేశాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరో 100 కోట్లు
ఈ ఏడాది జనవరిలో రావలసిన ఆదిపురుష సినిమా పై తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ రావడంతో మళ్ళీ ఒక్కసారిగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. గ్రాఫిక్స్ సన్నివేశాల కోసం రీ వర్క్ చేయాలని మరో 100 కోట్లు ఖర్చుపెట్టడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

వాయిదా అంటూ రూమర్స్
రీ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే సగానికి పైగా గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయి. ఇక సినిమాలో అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 2023 జూన్ 16వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పుడు కూడా అనుమానమే అని వాయిదా పడే అవకాశం ఉంది అని మరొక టాక్ వినిపించగా దర్శకుడు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు.
|
మరో 150 రోజుల్లో
సినిమా అనుకున్న సమయానికి రాబోతోంది అని దర్శకుడు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరొక అప్డేట్ ఇచ్చాడు. ఇంకా ఆదిపురుష్ సినిమా 150 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని చెప్పాడు. శ్రీరాముడికి సంబంధించిన అద్భుతమైన కావ్యాన్ని అందించడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటాను అని తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని ట్విట్టర్ లో తెలియజేశాడు.

దారుణంగా ఫ్యాన్ కామెంట్స్
ఓం రౌత్ ఆ విధంగా వివరణ ఇవ్వడంతో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇన్ని రోజుల్లో అసలు సినిమా కోసం ఎలాంటి వర్క్ చేశారు? ఎలాంటి పనులు కొనసాగుతున్నాయి.. ఇప్పటివరకు సరైన పోస్టర్ కూడా విడుదల చేయలేదు. ఇప్పటికైనా మంచి ప్రమోషన్స్ చేసి సినిమాకు హైప్ పెంచాలని అంటున్నారు. మరికొందరు అయితే ప్రభాస్ అనవసరంగా ఇతనికి డేట్స్ ఇచ్చాడు అని దారుణంగా కామెంట్ చేస్తున్నారు. మరి సినిమా విడుదల తర్వాత ఎలాంటి కామెంట్స్ అందుకుంటాడో చూడాలి.