మహేష్ బాబు మూవీలో అదితిరావు హైదరి?
అదితి రావు హైదరి 'సమ్మోహనం' మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించడమే కాదు, ప్రేక్షకుల నుండి సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తొలి సినిమాతోనే అదితి రావు హైదరి టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచేసింది. అదితి అందం, నటనకు మంచి రెస్పాన్స్ రావడంతో... ఆమెకు తెలుగులో రెండో సినిమా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు హీరోగా వంశీపడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం అదితి రావు హైదరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ఖరారు కాలేదు.

మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఇందులో మరో కీలకమైన పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం అదితి అయితే బావుంటుందనే అభిప్రాయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్లు తెలుస్తోంది.
దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అశ్వినీ దత్‌కు చెందిన వైజయంతి మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. షూటింగ్ ఇటీవలే డెహ్రడూన్‌లో మొదలైంది.


Click it and Unblock the Notifications











