కుర్ర హీరోతో అదితిరావ్ హైదరి రొమాన్స్.. వర్కవుట్ అయ్యేనా..?
సమ్మోహనం సినిమాతో మాయ చేసింది హైదరాబాద్ బ్యూటీ అదితిరావ్ హైదరి. అయితే ఆమె తన కొత్త సినిమాలో ఓ కుర్ర హీరోతో రొమాన్స్ చేయనుందనే వార్తలు బాగా షికారు చేస్తున్నాయి. అందం, అభినయం పరంగా మంచి క్రేజ్ అందుకు తగ్గ రెమ్మ్యూనరేషన్ అందుకుంటున్న ఈ భామ కుర్ర హీరో రాజ్ తరుణ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో ఇద్దరి లోకం ఒకటే సినిమాతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్.. ఆ వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో అదితిరావ్ హైదరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని వార్తలు జోరందుకున్నాయి. అదితిరావ్ హైదరితో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న డైరెక్టర్ అదితిరావ్ హైదరి అయితే ఈ కథకు సూటబుల్ అని భావిస్తున్నాడట.

డైరెక్టర్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. ఓ హీరో రాజ్ తరుణ్ పక్కన అదితిరావ్ హైదరి జోడీ ఎలా ఉంటుంది? ఈ ఇద్దరి సిల్వర్ స్క్రీన్ రొమాన్స్ ఎంతవరకు వర్కవుటవుతుంది అనే దానిపై జనంలో చర్చలు ముదిరాయి. సాధారణంగా అదితిరావ్ హైదరి రెమ్మ్యూనరేషన్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. మరి రాజ్ తరుణ్ లాంటి హీరో సినిమాలో హీరోయిన్ కోసం భారీ మొత్తం వెచ్చిస్తారా? అనేది కూడా సందేహాత్మక అంశమే. అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు చూడాలి మరి ఎలా ప్లాన్ చేసి వర్కవుట్ చేయనున్నారో! ప్రస్తుతం అదితిరావ్ హైదరి 'వీ' సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. నాని కెరీర్ లో 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











