లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లీ, అనుష్కలతో సినిమా?
ముంబై: ఆదిత్య చోప్రాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో సినిమా తీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో వారిద్దరు కలిసి ఓ యాడ్‌లో నటించారు. మరోసారి వారిద్దరు కెమెరా ముందుకు రానున్నారు. అయితే, ఈసారి పూర్తి నిడివి గల చలనచిత్రంలో నటిస్తారట.
ఆదిత్య చోప్రా క్రికెట్ ఇతివృత్తంగా సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో లీడ్ రోల్స్‌కు అనుష్క శర్మను, విరాట్ కోహ్లీని తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా ఆలోచన వచ్చిందే తడవుగా ఆయన వారిని అడిగేశారట. విరాట్ కోహ్లీకి కూడా ఆ ఆలోచన ఆసక్తి కలిగిందని అంటున్నారు.

రాణీ ముఖర్జీ ఆ సినిమాను నిర్మిస్తారట. ఆమె ఆదిత్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాణీ ముఖర్జీ స్వయంగా విరాట్ కోహ్లీని సంప్రదించిందట. అయితే, వచ్చే ఏడాది 2015 ఏప్రిల్ వరకు తనకు సమయం ఇవ్వాలని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పేశాడట. అప్పటికి పరిస్థితులు ఎలా మారిపోతాయో ఎవరు చెప్పొచ్చారు.
కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమాయణంపై మీడియాలో కథలు కథలుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల విరాటో కోహ్లీ ఇంగ్లాండుకు తీసుకుని వెళ్లడంపై వివాదం కూడా చెలరేగింది. అనుష్క శర్మ తనతో ఉన్న విషయాన్ని విరాట్ కోహ్లీ మీడియా నుంచి దాచి పెట్టలేకపోయాడని బిసిసిఐ అధికారులు కూడా అన్నారు.


Click it and Unblock the Notifications











