‘పులి’ని అడ్డుకోవడానికి స్కెచ్చేస్తున్న నాయకుడు...!?
ఒక సినిమా విడుదల అవుతోందంటే దాన్ని ఏదో ఒక రకంగా అడ్డుకుని పేరు, సొమ్ము చేసుకోవడానికి కొంతమంది రెడీగా ఉంటున్నారు. ఇలా చాలా సినిమాలకు జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'కొమరం పులి" సినిమా విడుదలను ఆపేయడానికి ఓ నాయకుడు ట్రై చేస్తున్నాడన్న విషయం తెలిసిందే.
'కొమరం" పేరును ఓ కమర్షియల్ సినిమా కోసం వాడుకోవడం అభ్యంతరకరం అంటూ ఐక్యవేదిక ఆదివాసి నాయకుడు కోర్టుకెక్కుతున్నాడట. ఈ సినిమా విడుదలను నిలిపివేయాల్సిందిగా కూడా ఈ నాయకుడు వివాదాన్ని లేవనెత్తాడని తెలుస్తోంది. అయితే మరికొందరు మాత్రం అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో భూపాల్ రెడ్డి కథానాయకుడుగా నటించిన 'కొమరం భీమ్" చిత్రానికి కూడా 'కొమరం" పేరు పెట్టారు కదా మరి అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందకని పవన్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఈ వివాదానికి 'కొమరం పులి" యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











