నాగార్జున మేనకోడలిని పెళ్లాడబోతున్న యంగ్ హీరో... సమంత సెట్ చేసిందా?
'గూఢచారి' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో అడివి శేష్ త్వరలో టాలీవుడ్లోని ఒక స్టార్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడిగా మారబోతున్నాడట. నటి, నిర్మాత సుప్రియ యార్లగడ్డను అతడు పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది.
సుప్రియ యార్లగడ్డ మరెవరో కాదు.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు మనవరాలు, నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్‌కు స్వయాన సోదరి. సుప్రియ-అడవి శేష్ వివాహానికి ఇరు కుటుంబాల వారు అంగీకారం తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇద్దరినీ దగ్గర చేసిన ‘గూఢచారి’
‘గూఢచారి' చిత్రంలో అడవి శేష్, సుప్రియ కలిసి పని చేశారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, తమ స్నేహ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలని డిసైడయ్యారని టాక్.

సమంత సెట్ చేసిందా?
సుప్రియ, అడవి శేష్ రిలేషన్ పెళ్లి దిశగా సాగడంలో అక్కినేని కోడలు సమంత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ విషయం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే సుప్రియ-అడివి శేష్ పెళ్లి విషయం అఫీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.

సుప్రియ యార్లగడ్డ
పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన సుప్రియ... ఆ మూవీ ప్లాప్ కావడంతో సినిమాలకు దూరం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ వ్యవహరాల్లో బిజీ అయిపోయారు. దాదాపు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె ‘గూఢచారి' చిత్రంలో నటించారు.

అడవి శేష్
‘కర్మ' సినిమాతో నటుడిగా, దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన అడవి శేష్... పంజా, బలుపు, బాహుబలి చిత్రాల్లో నటించాడు. శేష్ హీరోగా చేసిన ‘క్షణం', ‘గూఢచారి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్నాయి.


Click it and Unblock the Notifications











