twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడివి శేష్‌కు 2 స్టేట్స్ కష్టాలు.. చిక్కుముడి వీడేనా?

    |

    చేతన్ భగత్ రాసిన 2 స్టేట్స్ నవల ఆధారంగా బాలీవుడ్‌లో 2 స్టేట్స్ సినిమా తెరకెక్కింది. అందులో అర్జున్ కపూర్, అలియా భట్ కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాలు, విభిన్న ఆచార సంప్రదాయాలు, ప్రేమ, కుటుంబం, పెళ్లి విషయాల చుట్టూ తిరిగే ఈ కథలో అర్జున్ కపూర్, అలియా భట్‌లు ఎంతో గొప్పగా జీవించారు. అలాంటి సినిమానే అదే టైటిల్‌తో తెలుగులోనూ రీమేక్ చేయాలని అనుకున్నారు.

    అడివి శేష్, శివానీ రాజశేఖర్‌లతో గ్రాండ్‌గా సినిమాను ప్రారంభించారు. కానీ సినిమాను మాత్రం ఇంకా పూర్తి చేయలేకపోతున్నారు. అడివి శేష్ ఈ ప్రాజెక్ట్‌పై అంతగా శ్రద్ద చూపించకపోవడం, సినిమా సక్సెస్‌పై అంత నమ్మకం లేకపోవడమో లేదా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ రావడంతోనో ఏమో గానీ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం లేదు. ఈ సినిమా ఎప్పుడో మూలకు పడింది. దాదాపు 90 శాతం షూటింగ్ కూడా అయిపోయింది. ఈ సినిమాని ఎలాగైనా స‌రే, పూర్తి చేసి విడుద‌ల చేయాల‌న్న‌ది నిర్మాత ఎం.ఎల్‌.వి స‌త్య‌నారాయ‌ణ ప్లాన్‌.

     Adivi sesh Not Interested in 2 States Remake

    అడ‌విశేష్ మ‌రో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే.. ఈ సినిమా అయిపోతుందట. అయితే శేష్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప‌రిస్థితుల్లో టూ స్టేట్స్‌ కాల్సీట్లు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. సినిమాని ఆపేద్దాం. నా పారితోషికం తిరిగి ఇచ్చేస్తా. కావాలంటే మ‌రో సినిమా చేస్తా అని నిర్మాత‌కు మాట ఇచ్చాడ‌ని తెలుస్తోంది.

    కానీ... ఇప్ప‌టి వ‌ర‌కూ పారితోషికం వెన‌క్కి ఇవ్వ‌లేదు. మ‌రో సినిమా ఒప్పుకోలేదు. మొత్తానికి మండిపోయిన నిర్మాత కోర్టుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ముందు 2 స్టేట్స్ సంగతి తేల్చమని అడివి శేష్‌కు కోర్ట్ సూచించినట్టు తెలుస్తోంది.

    English summary
    Adivi sesh Not Interested in 2 States Remake.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X