పెళ్లికి ముందే నయనతారకు బాలయ్య సీక్రెట్ గిఫ్ట్
సింహా సినిమాలో బాలయ్య సరసన నటించిన నయనతార....అందులో బాలయ్యతో పోటీ పడి నటించి మంచి మార్కులు కొట్టేసింది. అదే సమయంలో బాలయ్యకు చాలా దగ్గరయింది. ఈ చనువుతోనే తన తర్వాతి సినిమా ' శ్రీరామ రాజ్యం"లో రికమండ్ చేసి మరీ సీత క్యారెక్టర్ ఇప్పంచాడు బాలయ్య. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది కూడా. త్వరలో ప్రభుదేవాను పెళ్లి చేసుకోబోతున్న నయన....ఇదే తన చివరి సినిమా, పెళ్లి తర్వాత నటించడానికి ప్రభుదేవా ఒప్పకోడు అంటూ తెగ ఏడ్చేసిన సంగతి తెలిసిందే.
కాగా...తన సినిమా దర్వాతే సినీ జీవితానికి వీడ్కోలు చెబుతూ....ఇంటిది కాబోతున్న నయనకు బాలయ్య చాలా ఖరీదైన బహుమతి ఇచ్చాడట. శ్రీరామరాజ్యం షూటింగ్ జరుగుతున్న సయమంలోనే బాలయ్య నయనను పర్సనల్ గా పక్కకు పిలిచి సదరు బహుమతి ఇచ్చినట్లు యూనిట్ సభ్యులు చర్చించుకుంటున్నారు. అయితే ఆ బహుమతి ఏమిటి? అంత పర్సనల్ పిలిచి మరీ ఎందుకు ఇచ్చినట్లు? అదే మైనా బయటకు చెప్పకూడని బహుమతా? అనే చర్చ సాగుతోంది. ఈ సీక్రెట్ బహుమతి గురించి ఇంత చర్చ జరుగుతున్నా.... ఇటు బాలయ్యగానీ, అటు నయన గానీ ఏమీ ఎరుగనట్లు నటిస్తుండటం గమనార్హం. ఇప్పటికైనా సీక్రెట్ బహుమతి ఏమిటో బయటకు చెప్పకుంటే ప్రభుదేవా అపార్థం చేసుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











