హీరోయిన్ల బికీనీలపైన అడ్వర్‌టైజ్‌మెంట్లు..?
అడ్వర్ టైజ్ రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. వీక్షకుడి కళ్ళు వేటిని త్వరగా ఆకర్షిస్తాయో వాటిని ప్రకటనలకు వాడేస్తున్నారు. అయితే ఆకర్షించే గుణం అందగత్తెల బికినీలకు ఉంటుందని గమనించిన బెట్ ఫెయిర్ అనే ఇంగ్లాండ్ కంపెనీ సరికొత్త ప్రమోషన్ దిశగా అడుగులు వేస్తుంది. ఇంగ్లాండ్ కు చెందిన ప్రఖ్యాత బీచ్ వాలీబాల్ క్రీడాకారిణులు జారా డాప్నే, షౌనా ముల్లిన్ ల బికినీల వెనుక భాగాన్ని ఈ కంపెనీ కొనుక్కుంది. ఈ క్రీడాకారిణులు ఎప్పుడు బరిలోకి దిగినా ప్రొమోషన్ ఉన్న కంపెనీ బికినీలతోనే దిగుతారు. ఈ అందగత్తెలను ఎవరైనా ఐ ఫోన్ సహాయంతో ఫోటోలు తీస్తే, బికినీల పై ఉన్న బార్ కోడ్ ఆధారంగా ఆ కంపెనీకి చెందినా వెబ్ సైట్ అయిపోతుందట. దాంతో వారికి కావలసినంత పబ్లిసిటీ అని బెట్ ఫెయిర్ కంపెనీ భావిస్తుంది. అసలే బికినీ అంటే ఉండేదే రెండు ముక్కలు. వాటినీ ఈ భామలు మరొకరికి అమ్మేశారు.
కాగా...ఈ సూత్రాన్ని త్వరలో సినిమా హీరోయిన్లపై ప్రయోగించడానికి సిద్దం అవుతున్నాయట కార్పొరేట్ కంపెనీలు. హాలీవుడ్ హాట్ భామలను ఇందుకు ఒప్పించేందుకు కంపెనీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయట. అది సక్సెస్ అయితే త్వరలో హాలీవుడ్ భామల బికినీలపై అడ్వర్‌టైజ్‌మెంట్లు కనిపించనున్నాయి. సాధారణంగా హాలీవుడ్ ను ఫాలో అయ్యే మన దేశం హీరోయిన్లు కూడా మున్ముందు ఇలాంటి వాటికి సిద్దం అవుతారేమో..?


Click it and Unblock the Notifications











