లూటీ కొట్టు...నీ ఇష్టం వచ్చినట్లు అంటు అల్లు శిరీష్ పై ఓ అడ్వకేట్..!?
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరిష్ సౌత్ స్కోప్ మ్యాగజైన్ ద్వారా మీడియా ఫీల్డ్ అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. అనతికాలంలోనే తనకంటూ ఓప్రత్యేకతను సాధించుకున్నారు అల్లు శిరిష్. ట్విట్టర్ లో కూడా హాల్ చల్ చేస్తూ ఉంటాడు. మెగా ఫ్యామిలీ సినిమాలే కాకుండా ఇతర హీరో సినిమాలపైన వ్యక్తుల పైన కూడా ప్రశంసలు, విమర్శలు గుప్తింస్తుంటాడు. ఎప్పుడూ లాగే ఈ సారికూడా మళ్లీ ఓ అడ్వకేట్ ఆగ్రహానికి గురయ్యాడు...
ఇటీవల ఓ అడ్వకేట్ అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ పై తన ఆగ్రహాన్నంతా వ్యక్తం చేశాడు. 'లూటీ కొట్టు...నీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచు. థియేటర్లన్నీ మీ నాన్న చేతిలోనే ఉన్నాయిగా" అని శిరీష్ ట్విట్టర్ కి పంపించాడు. అందుకు బదులుగా అల్లు శిరీష్ కూడా ఘాటుగానే స్పందించాడు.
ఎంత రేటు పెట్టి టిక్కెట్ కొనాలో జనాలకు బాగా తెలుసని, నువ్వు నోరు జారొద్దని సదరు అడ్వకేట్ కి పోస్ట్ చేశాడు శిరీష్. ఇలా ట్విట్టర్ ద్వారా చివాట్లు తినడం శిరీష్ కి ఇది మొదటిసారి కాదు. మీ సినిమాలను ప్రమోట్ చేయడానికే నువ్వు ట్విట్టర్ పెట్టావని, చిన్న సినిమాల విలువ మీకు తెలియదని...ఇలా పలువురు పలు రకాలుగా శిరీష్ పై విరుచుకుపడిన దాఖలాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











