10 ఏండ్ల నిరీక్షణకు తెర.. అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్..

తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు పదేళ్లుగా చర్చల్లో ఉన్న ఒక క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కబోతుందట. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మరో సినిమా రాబోతుందట. ఇప్పటికే 9 వరుస విజయాలతో దూసుకపోతున్న డైరెక్టర్ అనిల్ తన పదో సినిమాగా విక్టరీ వెంకటేష్- కళ్యాణ్ రామ్ కాంబోలో సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టారట. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా టాలీవుడ్ యంగ్ హీరోతో తన నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యారట. నిజానికి ఈ ఇద్దరి కలయికలో 10 ఏండ్ల క్రితమే సినిమా రావాల్సి ఉందట. ఇంతకీ ఆ హీరో ఎవరు?

ఆ కాంబో ఎవరో కాదు.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కబోతుందట. రామ్ చరణ్ తనదైన ఎనర్జీతో, డ్యాన్సులతో, మాస్ అండ్ క్లాస్ పాత్రలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మరొకరు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నవ్వులు పూయిస్తూ హిట్ మిషన్‌ అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా రాబోతుందట. ఎట్టకేలకు దాదాపు దశాబ్దం కాలం నాటి ఈ నిరీక్షణకు తెరపడుతూ ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కబోతున్నట్టు టాక్.

After 10 Years Anil Ravipudi and Ram Pothineni Combo Finally Set

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ రాజా ది గ్రేట్ (Raja the Great) కథను మొదట రామ్ పోతినేని కోసం సిద్ధం చేశారట. ఆ కథను రామ్‌కు వినిపించినప్పటికీ, అప్పట్లో వరుస మాస్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత అదే కథ హీరో రవి తేజ (Ravi Teja) వద్దకు వెళ్లి భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి 'రామ్- అనిల్'కాంబో ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఈ కాంబో సెట్ కావడంతో 10 ఏండ్ల నిరీక్షణకు ముగింపు దశ దగ్గరపడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి ఇటీవల రామ్‌కు ఒక కొత్త కథా లైన్ వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, పూర్తిస్థాయి కథ రెడీ అయిన తర్వాత అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం రామ్ తన కెరీర్‌లోనే అత్యంత వైవిధ్యమైన ప్రాజెక్ట్ RAPO 23తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగానూ కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నారు. "ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

మరోవైపు అనిల్ రావిపూడి కూడా భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న ఈ సినిమా 2027 సంక్రాంతి టార్గెట్‌గా తెరకెక్కనుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాతే రామ్ - అనిల్ రావిపూడి కాంబో మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X