"ది రాజా సాబ్" ఐటెం సాంగ్ .. 17 ఏళ్ల తర్వాత ఆమెతో ప్రభాస్ రొమాన్స్?
ప్రస్తుతం పాన్ ఇండియా టాప్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే తాను చేస్తున్న భారీ సినిమాల్లో కొంచెం తక్కువ హైప్ ఉన్న సినిమాలు కూడా లేకపోలేవు. అయితే అవి దర్శకుడు బ్రాండ్ మూలాన కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ తరహా సినిమాల్లో దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో చేస్తున్న క్రేజీ హారర్ సినిమా "ది రాజా సాబ్" కూడా ఒకటి.
ఈ చిత్రంలో ప్రభాస్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఒక కంప్లీట్ డిఫరెంట్ రోల్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ లో ఇప్పుడిప్పుడే కొంచెం హైప్ బిల్డప్ అవుతుంది. అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన మొదట్లో అయితే ససేమిరా మారుతీ లాంటి దర్శకునితో సినిమా వద్దని ఫ్యాన్స్ ఎలాంటి రచ్చ చేసారో కూడా అందరికీ తెలిసిందే. కాగా ఆ స్టేజి నుంచి ఇపుడు ఫైనల్ గా తమ సినిమా కోసం వారిని ఎదురు చూసేలా చేసి చిత్ర యూనిట్ మొదటి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం రాజా సాబ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆల్రెడీ ఈ చిత్రంలో టాప్ అండ్ గ్లామరస్ హీరోయిన్స్ కూడా ప్రభాస్ సరసన రొమాన్స్ చేస్తారని తెలిసిందే. తమిళ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ అలాగే మరో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్‌లు ఆల్రెడీ షూటింగ్‌లో ఉన్నారు. వీరితో పాటుగా మరో గ్లామరస్ సెన్సేషన్ ఈ చిత్రంలో మెరవబోతున్నట్టుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఒకటి ఉంటే ఆ సాంగ్ కోసం రీసెంట్ కాంట్రవర్సియల్ బ్యూటీ నయనతారని మేకర్స్ దాదాపు ఫైనల్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా హీరో ధనుష్ తో నయన్ ఎలాంటి కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచిందో తెలిసిందే. ఇపుడు ఫైనల్‌గా ప్రభాస్‌తో కలిసి మాంచి ఊపున్న ఐటెం సాంగ్ లో మెరవనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఇదే కానీ నిజం అయితే మళ్ళీ 17 ఏళ్ళు తర్వాత ప్రభాస్ నయనతారలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అని చెప్పాలి. ఎప్పుడో 2007లో వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన యోగి సినిమాకి ప్రభాస్ అండ్ నయనతారలు కలిసి నటించారు. మళ్ళీ ఇపుడు ఐటెం సాంగ్ కోసం వాళ్లు కలబోతున్నారని చెప్పొచ్చు. ఈ క్రేజీ రూమర్ పై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇక ఈ బిగ్ ప్రాజెక్ట్ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా రీసెంట్ గానే బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ సినిమాలో విజువల్స్ హాలీవుడ్ చిత్రం హ్యారీ పోటర్ రేంజ్ లో ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశారు. మరి ఈ రేంజ్ విజువల్స్ కి తగ్గట్టుగానే భారీ మొత్తాన్ని పీపుల్ మీడియా సంస్థ పెడుతున్నారట. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











