పుష్ప 2 లో ఐటెమ్ సాంగ్ కోసం బాలీవుడ్ శృంగార తార.. జాన్వీ కపూర్‌కు అలా షాకిచ్చేలా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2021 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్నిఅందుకుంది. స్మగ్లర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును తీసుకొచ్చి పెట్టిన సినిమాగా పుష్ప గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కోసం బన్నీ ఎంతో కష్టపడ్డాడు. దానికి ఫలితం కూడాగట్టిగానే వచ్చింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ను తెరకెక్కించే పనిలో పడ్డాడు సుకుమార్. దాదాపు మూడేళ్లు బన్నీ ఈ సినిమా కోసం వేరే సినిమాను ఒప్పుకోకుండా కష్టపడుతున్నాడు. ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ కు రెడీ అయ్యింది. ఆగస్టు 15 న పుష్ప 2 ప్రేక్షకులకు రాబోతుంది. ఈసారి పుష్పను మించి పుష్ప 2 ఉండబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా మరింత హైప్ ను తీసుకొచ్చింది.

After ANIMAL Success Tripti Dimri Roped-In For A Spicy Item Number In Pushpa 2 With Allu Arjun

పుష్ప పుష్ప సాంగ్అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. సూసేటి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామీ.. అంటూ సాగిన ఈ సాంగ్ కూడా రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. పుష్ప సినిమాకు హైలైట్ గా నిలిచింది సమంత ఐటెంసాంగ్. ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా అంటూ బన్నీతో కలిసి స్టెప్స్ అదరగొట్టింది. ఇక పుష్ప 2 లో కూడా ఆ రేంజ్ ఐటెంసాంగ్ పెట్టాలని సుకుమార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ ఐటెంసాంగ్స్ చేస్తున్న విషయం తెల్సిందే. అలానే పుష్పలో సమంత ఆ సాంగ్ చేసింది. పుష్ప 2 కోసం కూడా సమంతనే అడిగారట. కానీ, ఆమె ఒప్పుకోకపోవడంతో మరో స్టార్ హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట సుకుమార్.

ఇప్పటికే పుష్ప 2 లో ఐటెంసాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీస్ అందరితో మైత్రీ సంప్రదింపులు జరుపుతుందని టాక్. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ను కూడా ఈ సాంగ్ కోసం సంప్రదించారట. కానీ, జాన్వీ తండ్రి బోనీ కపూర్ మాత్రం ఈ ఆఫర్ ను తిరస్కరించాడట. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సెటిల్ అవుతున్న జాన్వీ.. ఇప్పుడు ఐటెంసాంగ్ చేస్తే బాగోదని ఆయన తిరస్కరించాడట.

After ANIMAL Success Tripti Dimri Roped-In For A Spicy Item Number In Pushpa 2 With Allu Arjun

ఇక దీంతో సుకుమార్.. అనిమల్ బ్యూటీని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. త్రిప్తి డిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిమల్ సినిమా రిలీజ్ తరువాత త్రిప్తి అందరికి బాబీగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలు సైన్ చేస్తున్న ఈ చిన్నదానికి.. ఇప్పుడు పుష్ప ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. బన్నీ సరసన డ్యాన్స్ చేసే ఛాన్స్ ను పట్టేసింది. పుష్ప 2 లో త్రిప్తి ఐటెంసాంగ్ చేయనుందని టాక్ నడుస్తోంది.

ఇంకా నిజం చెప్పాలంటే ఇది త్రిప్తికి ఒక మంచి ఛాన్స్. పుష్పలో సమంత ఐటెంసాంగ్ కు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. . ఇక ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిట్ అయితే త్రిప్తికి తెలుగులో మంచి గుర్తింపు వచ్చినట్టే. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా వెల్లడించేవరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం త్రిప్తి బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X