»   » నిజమా?: అల్లు అర్జున్ కు మరో “మగధీర”

నిజమా?: అల్లు అర్జున్ కు మరో “మగధీర”

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ కు "మగధీర" లాంటి విజయం రాబోతోందా...అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఆయన త్వరలో రాజమౌళి తో పనిచేయనున్నారని ఈ మేరకు గీతా ఆర్ట్స్ ...ముందడగు వేసిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం బాహుబలి బిజీలో ఉన్న రాజమౌళి తన తదుపరి చిత్రం అల్లు అర్జున్ తో చేసే అవకాసం ఉందని, ఈ మేరకు ఓ కథని చెప్పారని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బోయపాటి శ్రీను తో ఓకే చేసిన ప్రాజెక్టు తదనంతరం ఈ చిత్రం కు సంభందించిన పనులు పూర్తి అవుతాయని అంటున్నారు. అప్పటికి రాజమౌళి సైతం బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని రంగంలోకి దిగుతాడని అంటున్నారు. రాజమౌళి, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే అంచనాలు ఓ రేంజిలో ఉంటాయంటున్నారు మెగాభిమానులు. అయితే ఈ విషయమై రాజమౌళి నుంచి కానీ, గీతా ఆర్ట్స్ నుంచి అఫీషియల్ ప్రకటన లేదు.

ఇది రూమర్ కాకుండా నిజం కావాలని అభిమానులు కోరుతున్నారు. మరో ప్రక్క అల్లు అర్జున్ తో కాదు మహేష్ తో రాజమౌళి తన తదుపరి చిత్రం చేయనున్నారని కొందరంటున్నారు. జేమ్స్ బాండ్ తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుందని ఆ వార్తల సారాంశం. ఏది నిజమో తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే...లేదా రాజమౌళి ఎప్పటిలాగే ట్విట్ తో స్పందించాల్సిందే.

అల్లు అర్జున్ ...తాజా చిత్రాల విషయానికి వస్తే...

After Baahubali, Rajamouli’s next with Allu Arjun

తొలి నుంచి తనదైన శైలిలో మాస్‌ కథల్ని తెరకెక్కించడంలో ప్రత్యేకత చూపుతూ హిట్స్ కొట్టడం బోయపాటి శ్రీను శైలి ప్రత్యేకం. 'భద్ర', 'తులసి', 'సింహా' చిత్రాలతో హిట్ చిత్రాల దర్శకుడయ్యారు. గతేడాది 'లెజెండ్‌'తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకొన్నారాయన. దాంతో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు కథను సిద్ధం చేసుకొన్నారు. ఆ చిత్రం త్వరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు బన్ని. ఆ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను సినిమా కోసం బరిలోకి దిగాలని బన్ని నిర్ణయించుకొన్నారని తెలిసింది. గీతా ఆర్ట్స్‌ సంస్థలో తెరకెక్కనున్న ఆ చిత్రానికి తమన్‌ స్వరాలు సమకూరుస్తారు.

అల్లు అర్జున్‌ను తెరపై 'జులాయి'గా చూపించి ప్రేక్షకులకు వినోదాలు పంచారు త్రివిక్రమ్‌. ఆ ఇద్దరి కలయికలో ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతోంది. సమంత, నిత్యమేనన్‌, ఆదాశర్మ హీరోయిన్స్. రాధాకృష్ణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

త్రిశూలం, హుషారు, జాదూగర్ వంటి టైటిల్స్ పరిశీలనలకో వచ్చినా కథ ప్రకారం ఇదే సరైన టైటిల్ అని దర్శకుడు, హీరో భావించినట్లు సమాచారం. మార్చి చివరలో కాని,ఏప్రియల్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం విడుదల అవనుంది. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా పడుతుందని చెప్తున్నారు. తండ్రి కొడుకుల రిలేషన్ కూడా కథలో ప్రధానంగా సాగుతుందని అంటున్నారు.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా ఓ సెట్‌ వేశారు. కీలకభాగం చిత్రీకరణ అక్కడే జరిగింది.

ఇందులో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపిస్తాడనీ, సినిమా అంతా పెళ్లి సందడి మధ్య సాగుతుందని తెలుస్తోంది. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మరో ప్రక్క ఈ చిత్రం పూర్తవగానే మహేష్ ,త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రారంభం కానుంది. జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఈ కొత్త ప్రాజెక్టు పట్టాలు ఎక్కవచ్చు. ఈ మేరకు ఎగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటికి మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని ఫినిష్ చేసుకుని రెడీ అవుతారు.

English summary
Grapevine indicates Ace director Rajamouli is said to be wiling to direct Allu Arjun after he completes his work with Prabhas.
Please Wait while comments are loading...