బ్రహ్మీ తర్వాత ఇప్పుడు అలీ వంతు..‘కాట్రవెల్లి’..!?
ఈ మధ్య కాలంలో ఫోటో మార్ఫింగ్ ఎక్కుగా జరగుతోంది. కొంతమంది ఫ్యాన్స్ మార్ఫింగ్ ఇమేజులతో బ్రహ్మానందం పై ప్రయోగాలు చేస్తూఉంటారు. పాపులర్ గా ఉన్న సెలబ్రెటీల ఫేస్ లను మార్ఫింగ్ చేస్తూ బ్రహ్మానందం ఫోటోలను నెట్ లో వదులుతూ ఉంటారు. అదే విధంగా ఈ మద్య రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంలోని జూ ఎన్టీఆర్ ముఖచిత్రాన్ని మార్ఫింగ్ చేసిన బ్రహ్మి ఊసరబల్లి అంటూ పలు వెబ్ సైట్స్ లో స్వైర విహారం చేశాయి. ఈ చిత్రం చూసిన వాళ్ళు చాలా మంది నవ్వుకుంటున్నారు.
నిన్నటివరకూ మహేష్ దూకుడు పోస్టర్స్ ని బ్రహ్మానందంతో పాకుడు అని,నూకుడు అని ఫోటో షాప్ లో చేసిన వారు ఇప్పుడు ఈ విధంగా ఊసరవిల్లిపై పడ్డారు. అయితే ట్విస్టు ఏమిటంటే అస్సలు ఊసరవిల్లి పోస్టర్ కన్నా ఇదే బాగా ప్రాచుర్యం పొందటంతో ఇప్పుడు కమేడియన్ అలీ మీద ప్రయోగం చేశారు. ప్రతి ఒక్కరికి తెలుసు అలీ 'ఎన్నాచాట, కాట్రవెల్లి", అనే పదాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవిస్తుంటాడు. ఈ పదాలలోని కాట్రవెల్లినీ జూ ఎన్టీఆర్ ఫోటోను అలీ ఫేస్ కి మార్ఫ్ చేసి 'కాట్రవెల్లి"గా నెట్ వదిలారు. బ్రహ్మానందం తర్వాత అలీ వంతు వచ్చిందటూ కాట్రవెల్లి గెటప్ చూసిన ప్రేక్షకులు తెగ నవ్వుకుంటున్నారు...


Click it and Unblock the Notifications











