ఓ వైపు ధనుష్ డేటింగ్ రూమర్.. మరో వైపు స్టార్ క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ షాకింగ్ రిలేషన్షిప్
బుల్లితెర నుంచి వెండితెర మీద అడుగుపెట్టి తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు మృణాల్ ఠాకూర్. టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ రేసులో దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మ.. అయితే సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతోనే మృణాల్ ఠాకూర్ లైమ్ లైట్‌లో నిలుస్తున్నారు. ఈవిడ మీద వచ్చినన్ని గాసిప్స్ ఏ హీరోయిన్ మీద రాలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా మృణాల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మృణాల్ ఎఫైర్స్ లిస్ట్ పెద్దదే
మృణాల్ ఠాకూర్ పలువురు హీరోలు, సింగర్స్, నటులతో ఎఫైర్లు నడిపినట్లు పలు ఊహాగానాలు వినిపించాయి. తొలుత బుల్లితెరపై శరద్ త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన మృణాల్.. ఆయనతో పెళ్లి వరకు వెళ్లింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత కుంకుమ భాగ్య సీరియల్‌లో తన సహనటుడు ఆర్జిత్ తనేజాతో డేటింగ్ చేసి అతనితోనూ ఎక్కువ రోజులు రిలేషన్ మెయింటైన్ చేయలేదు. అనంతరం హీరోయిన్‌గా వచ్చిరావడంతోనే యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో ప్రేమలో పడినట్లు ఊహాగానాలు వినిపించాయి.

సుమంత్ పేరు వైరల్
తర్వాత నటుడు బాద్షాతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మృణాల్.. హీరోయిన్ శిల్పాశెట్టి నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది. కానీ ఏం జరిగిందో ఏమోకానీ ఈ జంట తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్రకటించారు. అలాగే కుశాల్ టాండన్‌తోనూ మృణాల్ డేటింగ్ చేసినట్లుగా బీటౌన్ టాక్. ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ హీరో అక్కినేని సుమంత్‌తో మృణాల్ క్లోజ్‌గా ఉన్న ఫోటో వైరల్ అయ్యింది. మీడియాలో ఇది ప్రముఖ వార్త కావడంతో వీరిద్దరూ స్పందించారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
ధనుష్‌తో క్లోజ్‌గా మృణాల్ ఠాకూర్
కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో మృణాల్ క్లోజ్‌గా ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. సన్ ఆఫ్ సర్దార్ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా ధనుష్ చేతిని పట్టుకున్న మృణాల్ వీడియోలు వైరల్ అయ్యాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్‌ని, అతని కుటుంబ సభ్యులను మృణాల్ ఫాలో కావడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత వీరి వ్యవహారం సద్దుమణగగా.. ఇటీవల తన కాశీ పర్యటన, వారణాసితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ధనుష్ చేసిన పోస్ట్‌కు మృణాల్ కామెంట్ పెట్టడంతో తిరిగి ఊహాగానాలు వెల్లువెత్తాయి.
ఆ స్టార్ క్రికెటర్‌తో ప్రేమాయణం?
అయితే ఇంతలోనే మృణాల్‌కు సంబంధించి మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. మృణాల్ మరో కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుందన్నది ఆ వార్తల సారాంశం. అతను ఎవరో కాదు.. టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తీవ్రంగా గాయపడిన ఈ బ్యాట్స్‌మెన్‌తో మృణాల్ డేటింగ్ చేస్తున్నారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ తమ బంధాన్ని ప్రస్తుతం గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారట. సమయం చూసి తమ రిలేషన్ బయటపెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ, మృణాల్‌పై నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగుతున్నారు.


Click it and Unblock the Notifications











