ప్రభాస్‌పై కన్నేసిన ధురంధర్ డైరెక్టర్.. ఆ స్టార్ హీరోలను కాదని రెబల్ స్టార్‌తో..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో అత్యంత బిజీగా ఉన్న హీరోల్లో ఒకరు. వాస్తవానికి 'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ స్థాయి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ హీరోగా ప్రారంభమైన డార్లింగ్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్‌గా ఎదిగింది. భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా కథలు, అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సన్నివేశాలకు ప్రభాస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు. అందుకే టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమా చేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు అలాంటి దర్శకుల జాబితాలో బాలీవుడ్ స్టార్ ఫిల్మ్‌మేకర్ ఆదిత్య ధర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధర్, యాక్షన్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడిగా పేరు సంపాదించారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ధురంధర్, ధురంధర్ 2: ది రివెంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి. ఎవరూ ఊహించని స్థాయిలో భారీ విజయాలు సాధించడంతో ఆయన మార్కెట్ కూడా మరింత పెరిగింది. దీంతో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో ఉండబోతోందనే చర్చలు బాలీవుడ్‌లో జోరుగా సాగుతున్నాయి.

Aditya Dhar Eyes Prabhas for His Biggest Film

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆదిత్య ధర్ ఇప్పటికే ఓ భారీ యాక్షన్ డ్రామా కథను సిద్ధం చేస్తున్నారట. ఇది కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా సబ్జెక్ట్ ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్‌ను కూడా టార్గెట్ చేసేలా కథ, యాక్షన్ ఎలిమెంట్స్‌ను డిజైన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ భారీ కథకు సరిపోయే హీరో కోసం చూస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలను పరిశీలించినట్టు తెలుస్తోంది.

ఇక తాజాగా డైరెక్టర్ ఆదిత్యధర్ కన్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఇండియన్ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా మార్కెట్‌ను ఒంటిచేత్తో మోయగలిగే హీరోల్లో ప్రభాస్ ముందువరుసలో ఉన్నారు. సలార్, కల్కి2898 AD వంటి సినిమాలు ఆయన మార్కెట్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో కూడా ప్రభాస్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ఆదిత్య ధర్ వంటి దర్శకులు తమ కథలకు ప్రభాస్‌ను సరైన ఎంపికగా భావిస్తున్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

విశేషం ఏమిటంటే, ఆదిత్య ధర్‌తో పనిచేయడానికి బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం ఉంది. అలాగే సౌత్ ఇండియాకు చెందిన కొందరు అగ్రహీరోలు కూడా ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్నారట. అయితే దర్శకుడు మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ పేరునే ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌కు ఉన్న మాస్ ఇమేజ్, భారీ యాక్షన్ సినిమాల్లో కనిపించే స్క్రీన్ ప్రెజెన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమాన వర్గం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకుంటున్నారు.

అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావడం అంత సులభం కాదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఫౌజీ, స్పిరిట్, కల్కి2, సలార్ 2 వంటి సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ చిత్రాల షూటింగ్‌లు, విడుదలల కారణంగా ప్రభాస్ డైరీ ఇప్పటికే బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆదిత్య ధర్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆసక్తికర అంశంగా మారింది.

మరోవైపు ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆదిత్య ధర్ యాక్షన్ మేకింగ్, ప్రభాస్ స్టార్‌డమ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం నమోదవుతుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కితే ఈ దాదాపు 2000 కోట్ల మార్క్‌ను సులభంగా అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్తలన్నీ పరిశ్రమలో జరుగుతున్న ప్రచారమే. ఇప్పటివరకు ప్రభాస్ గానీ, ఆదిత్య ధర్ గానీ ఈ ప్రాజెక్ట్‌పై అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ కాంబినేషన్‌పై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Read more about: prabhas aditya dhar Dhurandhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X