SSMB29 తర్వాత.. ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన మహేశ్ బాబు.. వణికిపోవాల్సిందే!
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు చివరిగా 'గుంటూరు కారం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి SSMB29లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని జక్కన్న తలిచారని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబు ఎవరి దర్శకత్వంలో నటించబోతున్నారనే చర్చ ఇప్పుడే మొదలైంది. తాజాగా టాలీవుడ్ లోని సెన్సేషనల్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ29 వివరాలు..
ఎస్ఎస్ రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషణ్ లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూశారు. ఎట్టకేళకు ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 2 షెడ్యూళ్లు విజయవంతంగా పూర్తైంది. ఈ సినిమాను కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్ రూపుదిద్దుకుంటోంది. అమెజాన్ అడవుల్లో సాగే కథతో సూపర్ హీరోగా మహేశ్ బాబు ఆకట్టుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 'సలార్' నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మహేశ్ బాబు 30వ సినిమా దర్శకుడిగా..
ప్రస్తుతం మహేశ్ బాబు తన 29వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎలాగైనా ఈ ఏడాది పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. లేదంటే వచ్చే ఏడాది త్రైమాసికంలో ఫినిష్ అవుతుందని ఓ అంచనా. కాగా తర్వాత మహేశ్ బాబు తన 30వ చిత్రాన్ని ఏ దర్శకుడితో చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో 'ఉప్పెన'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చి బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు మహేశ్ బాబు ఆసక్తిగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
తొలి అడుగుతోనే రికార్డు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన డైరెక్టర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అప్టేడ్ అయ్యే డైరెక్టర్స్ తోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో తొలి చిత్రంతోనే బుచ్చిబాబు సంచలనంగా మారిపోవడంతో మహేశ్ బాబు కన్ను ఈయనపై పడిందని తెలుస్తోంది. 'ఉప్పెన'తో తన టేకింగ్ స్టైల్ ను చూపించిన బుచ్చిబాబు స్టార్ హీరోల చూపు తనపై పడేలా చేసుకున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్, ప్రేక్షకుల పల్స్ పట్టేస్తున్నాడు.
మహేశ్ బాబును డీల్ చేయగలడా?
అసలే ఇప్పుడు మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు కూడా గ్లోబల్ స్టార్ రేంజ్ ను సొంతం చేసుకుంటారు. అప్పుడు బాబును బుచ్చిబాబు డీల్ చేయగలడా? ఎస్ఎస్ఎంబీ29 తర్వాత వచ్చే భారీ రెస్పాన్స్ కు ధీటుగా సినిమా తీయగలడా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకు కొందరు అవుననే అంటున్నారు. కారణం రామ్ చరణ్ 'పెద్ది'. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదల చేసి గ్లింప్స్, కిక్రెట్ షాట్ తో ఇండియాను షేక్ చేశాడు. రామ్ చరణ్ తోనూ మాస్ డైలాగ్ లు చెప్పించారు. అలాగే ఒక్క వీడియో స్టార్ హీరోలను తన కు డీల్ చేయడం తెలుసు అని సమాధానం కూడా ఇచ్చారు. ఇంతకీ మహేశ్ బాబు - బుచ్చి బాబు ప్రాజెక్ట్ పై మున్ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











