పెళ్ళి..పిల్లలు...సంసార జీవితంలోనే ఆనందం...కమిలినీ ముఖర్జీ
"మరో అయిదారేళ్లలో పెళ్లి చేసుకొని, గంపెడు పిల్లల్ని కని, హాయిగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తా. నా దృష్టిలో స్ర్తీకి అంతకు మించిన ఆనందం ఉండదు" అంటూ చెప్పుకొచ్చింది కమిలినీ ముఖర్జీ. అలాగే తనకు ఏ మాత్రం షూటింగ్ గ్యాప్ దొరికినా కలకత్తా వెళ్ళిపోయి కుటుంబంతో గడిపివస్తానని చెప్తోంది. అలాగే తనకు పస్తుతం సినిమాల సంఖ్య తగ్గడానికి కారణం ఏంటనేది తెలియటం లేదుకానీ..చేసినంత వరకు మంచి పాత్రలు చేశాను. ఆనంద్, గోదావరి, గమ్యం, మీనాక్షి నాకు నటిగా తృప్తినిచ్చిన సినిమాలు. నేను వృత్తినే కాదు. వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ప్రేమిస్తాను అంది. అలాగే తను ఖాళీగా ఉన్నానని భాధపడటం లేదని, ఈ విరామాన్ని కూడా ఆనందంగానే అనుభవిస్తున్నాను అంది. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ..సిఐడీ మూస (మళయాళ) రీమేక్ లో చేస్తోంది. వేణు హీరోగా చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్మెంట్ అని తెలుస్తోంది. అలాగే ఈ నెలలో విడుదల కానున్న వెంకటేష్ "నాగవల్లి ది రిటన్ ఆఫ్ చంద్రముఖి" చిత్రంలోనూ ఆమె కీలకమైన పాత్రనే పోషించింది. వీటితో పాటు ఆమె మళయాళ చిత్రం కుట్టి శ్రాంక్ లో ముమ్మట్టీ సరసన చేసింది.


Click it and Unblock the Notifications











