మరో పాకిస్తాన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్? ఆమెని కూడా ఫైనల్ చేసారా?

ఇప్పుడిప్పుడే మళ్ళీ పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో తెలుగు సినిమా మరోసారి షైన్ అవుతుంది. ఈ ఏడాదిలో ఆల్రెడీ రెండు భారీ హిట్స్ డెలివర్ కాగా ఈ చిత్రాల తర్వాత మరిన్ని సినిమాలు ఈ 2024 ద్వితీయార్ధంలో రానున్నాయి. ఈ క్రమంలో మరిన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా లాంచ్ అవుతుండగా వాటిలో పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ రెబల్ స్టార్ నటించనున్న సినిమా కూడా ఒకటి.

దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ప్లాన్ చేసిన యుద్ధ నేపథ్య సినిమా ఇది కాగా ఈ చిత్రంలో ఇండో పాకిస్తాన్ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా లాంచ్ అవ్వడానికి ముందే మేకర్స్ పాకిస్తాన్ నటితో సినిమా చేయనున్నారు అని పలు రూమర్స్ రాగా ఇప్పుడు ఫైనల్ గా ఆమెని సినిమా లాంచ్ కే తీసుకొచ్చి కన్ఫర్మ్ చేసేసారు.

after iman esmail prabhas to romance with another pakistan beauty on fauji

కాగా ఇప్పుడు ఆల్రెడీ ఒక పాకిస్తాన్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ చేయనుండడం పక్కా అయిపోయింది. కానీ తాజాగా మరో ఫ్రెష్ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమాలో ఈమె ఒకరే కాకుండా మరో పాకిస్తాన్ బ్యూటీతో కూడా ప్రభాస్ రొమాన్స్ చేయనున్నాడు అంటూ పలు షాకింగ్ రూమర్స్ బి టౌన్ నుంచి మొదలయ్యాయి. పాకిస్తాన్ సినిమా దగ్గర మంచి ఆదరణ ఉన్న నటి సజల్ అలయ్ ని తీసుకున్నారు అంటూ టాక్ ఇప్పుడు మొదలయ్యింది.

మరి ఇమాన్ ఇస్మాయిల్ ఎలాగో ఆ రూమర్స్ నిజం అయ్యాయి. ఇప్పుడు ఈమె విషయంలో కూడా కూడా ఎంత నిజం ఉండే ఉండొచ్చు అని చెప్పాలి. కాగా ఈ భారీ చిత్రాన్ని హను 1940 స్వతంత్ర పోరాటాల నేపథ్యంలో తెరకెక్కించనుందగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానున్నట్టుగా టాక్ వినిపిస్తుండగా దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

after iman esmail prabhas to romance with another pakistan beauty on fauji

ఇక ఈ కొత్త హీరోయిన్ విషయానికి వస్తే ఈమె పాకిస్తాన్ లో మోడల్ పలు సినిమాలు వెబ్ షోస్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వార్తల్లో ఎంతమేర నిజముందో కాలమే నిర్ణయించాలి. ఇక రీసెంట్ గానే ప్రభాస్ పాన్ ఇండియా హిట్ "కల్కి 2898 ఎడి" తో అదరగొట్టగా ఇది 1100 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. అలాగే ఈ ఆగష్టు 22 నే ఓటిటిలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.

తెలుగు సహా తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుండగా హిందీలో లో మాత్రం వరల్డ్ పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించగా సుమారు 600 కోట్లకి పైగా బడ్జెట్ తో వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించారు. అలాగే అమితాబ్, కమల్ లాంటి దిగ్గజాలు నటించిన ఈ చిత్రానికి ఒక సినిమాటిక్ యూనివర్స్ ని కూడా నాగ్ అశ్విన్ డిజైన్ చేసాడు.

More from Filmibeat

Read more about: prabhas hanu raghavapudi fauji
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X