మరొక అగ్ర హీరోను లైన్ లో పెడుతున్న 'సర్కారు వారి పాట' దర్శకుడు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా దర్శకులు విభిన్నమైన కాంబినేషన్స్ ను సెట్ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో స్టార్ హీరోల సినిమాలు పెద్దగా సందడి చేసింది లేదు. పవన్ కళ్యాణ్ తప్పితే పెద్ద హీరోల్లో ఎవరు రాలేదు. ఇక వచ్చే ఏడాది మాత్రం పరిస్థితులు కాస్త అనుకూలించిన కూడా ఒక్కసారిగా బాక్సాఫీస్ పై అగ్ర హీరోలు దండయాత్ర చేసే అవకాశం లేకపోలేదు. నిజంగా ప్రేక్షకులకు నెవ్వర్ బిఫోర్ అనేలా సినిమాల పండుగ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు. ఇక అందులో మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాటపై అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను అందుకుంది. గీత గోవిందం లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం దర్శకుడు పరుశురామ్ నాగచైతన్యతో ఓ సినిమా చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో మహేష్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వలన ఆ ప్రాజెక్టును నాగచైతన్య అనుమతితోనే సెట్స్ పైకి తీసుకువచ్చాడు. అయితే గీత గోవిందం ముందు వరకు కూడా పరుశురామ్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఒక కథ కూడా సెట్ చేసుకున్నప్పటికీ బన్నీ ఎందుకో అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు.

After mahesh babu movie director parasuram project with allu arjun,

ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట ఏ మాత్రం హిట్ అయినా కూడా అతనికి అల్లు అర్జున్ డేట్స్ దొరికినట్లే అని చెప్పవచ్చు. ఇదివరకే అల్లు అరవింద్ ఆ దర్శకుడికి మాట కూడా ఇచ్చాడట. గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కంటే ముందు నాగచైతన్యతో సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కాస్త ఆలస్యం కావచ్చు. ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ లోపు సర్కారు వారి పాట పూర్తవుతుంది కాబట్టి ఇదే ఏడాది చివర్లో నాగచైతన్య సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే అవకాశం ఉందట.

ఇక అల్లు అర్జున్ కూడా ఐకాన్ సినిమా తో పాటు పుష్ప 2, కొరటాల శివ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది కాబట్టి బన్నీ పరశురామ్ ప్రాజెక్టుకు సమయం చాలానే ఉంటుంది. బన్నీ సినిమాలు పూర్తయ్యేలోపు నాగచైతన్య సినిమాను కూడా పూర్తి చేస్తే సరిపోతుంది. మరి వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక సర్కారు పాట విషయానికి వస్తే మహేష్ బాబు ఈ సినిమాలో ఒక బ్యాంక్ రికవరీ ఆఫీసర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే సినిమాలో మంచి సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా గట్టిగానే ఉంటాయట ముఖ్యంగా అభిమానులకు నచ్చే యాక్షన్ సన్నివేశాలు కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. మొదటిసారి మహానటి కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకని తన రేంజ్ ను మరింత పెంచుకోవాలని దర్శకుడు పరశురామ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X