మహేష్, ప్రభాస్ కోసం ఒకేసారి.. క్రేజీ దర్శకుడి ప్లానింగ్ అదుర్స్!
సుకుమార్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడు. రంగస్థలం చిత్రంతో రికార్డులు తిరగరాశారు. ఆకట్టుకునే కథ, కథనాలతో సుకుమార్ కట్టి పడేశారు. ప్రస్తుతం సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. మరో వైపు బాహుబలి తరువాత ప్రభాస్ ని వెండి తెరపై చూడడానికి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. సుకుమార్, ప్రభాస్ కాంబినేషన్ లో చిత్రం గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

బాహుబలి తరువాత
ప్రభాస్ ఏ చిత్రం చేసినా దానికి జాతీయ స్థాయిలో ప్రచారం కలుగుతుంది. ప్రభాస్ నేషనల్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తరువాత ప్రభాస్ పెద్ద పేరున్న దర్శకులతో పనిచేయడం లేదు. కేవలం ఒకటి, రెండు చిత్రాల అనుభవం ఉన్న సుజిత్, రాధాకృష్ణ లాంటి దర్శకులతో పనిచేస్తున్నాడు.

ప్రభాస్, మహేష్ కోసం ఒకేసారి
సుకుమార్ లాంటి స్టార్ డెరెక్టర్స్ తో ప్రభాస్ సినిమా పడితే ఎలా ఉంటుంది.. ఆ చిత్ర రేంజే మారిపోతుంది. ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ తదుపరి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అదే సమయంలో ప్రభాస్ తో సినిమా చేసేందుకు కూడా కథ సిద్ధం చేస్తున్నాడట.

హీరో ఇమేజ్ ఎలా ఉన్నా
హీరో ఇమేజ్ ఎలా ఉన్నా కథతో మెప్పించడం సుకుమార్ శైలి. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ ని వినికిడి లోపం ఉన్న యువకుడిగా చూపించాడు. మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉండే ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో లాంటి స్టైలిష్ చిత్రాన్ని రూపొందించి విజయాన్ని అందుకున్నాడు. దీనితో ప్రభాస్ కోసం కూడా వైవిధ్య భరితమైన కథనే సిద్ధం చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

సాహో విడుదలకు ముందే
బాహుబలి 2 తరువాత ప్రారంభమైన సాహో ఇంకా పూర్తి కాలేదు. కానీ ప్రభాస్ వరుసపెట్టి సినిమాలు ప్రారంభిస్తున్నాడు. ఏది ఏమైనా మహేష్ 26 వ చిత్రం, ప్రభాస్ 21 వ చిత్ర ప్రస్తుతం సుకుమార్ చేతుల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











