మహేష్ బాబు తరువాత రాజమౌళి సినిమా అతనితోనే.. ఇక ఆ హీరోను ఎవ్వడు ఆపలేడు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత నెవర్ బిఫోర్ అనేలా పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి వస్తున్నాయి. స్టార్ హీరోలు దర్శకులు అంతకుమించి అనేలా వారి స్థాయిని పెంచుకుంటున్నారు. లాక్ డౌన్ వలన దర్శకులు హీరోలు ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా ఇప్పుడే సెట్ చేసుకుంటున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా మహేష్ బాబు తరువాత చేయబోయే ప్రాజెక్ట్ పై కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ రూపురేఖలు మారిపోయాయి. ఆ సినిమా దెబ్బకు బాలీవుడ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. తెలుగు సినిమాలను ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదని ఫిక్స్ అయ్యారు. అందుకే నార్త్ నటీనటులు టాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే ఏ మాత్రం రిజెక్ట్ చేయడం లేదు.

ఆ సినిమాతో మరొక వండర్
రానున్న రోజుల్లో టాలీవుడ్ నుంచి మరిన్ని పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. పుష్ప - లైగర్ - RRR సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి RRR సినిమాతో మరొక వండర్ క్రియేట్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు - రాజమౌళి సినిమా..
RRR అనంతరం రాజమౌళి మహేష్ బాబుతో మరొక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఆ సినిమాలో మహేష్ బాబు సరికొత్త ఫిట్నెస్ తో కనిపిస్తాడని టాక్ కూడా వస్తోంది. ఇక మహేష్ బాబు సినిమా తరువాత కూడా జక్కన్న ఒక కథనైతే సెట్ చేసుకున్నాడట.

మరోసారి ప్రభాస్ తోనే..
సాధారణంగా రాజమౌళి ఎలాంటి కథ సెట్ చేసుకున్నా కూడా హీరోను క్చాలా ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక ఇటీవల తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన పవర్ఫుల్ స్టోరీ కోసం చాలా మంది హీరోల పేర్లను అనుకున్నప్పటికి ఫైనల్ గా ప్రభాస్ వద్దకే వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ తప్పితే ఆ కథకు మరొకరు సెట్టవ్వరని రాజమౌళి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
Recommended Video

నిజమైతే.. ఎవ్వరు ఆపలేరు
ఇక మరోవైపు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ అయిపోయిన అనంతరం 2023 చివరలో రాజమౌళి - ప్రభాస్ కాంబో సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే. ఒకవేళ నిజమయితే ప్రభాస్ ను ఆపడం ఎవరి వల్ల కాదు.


Click it and Unblock the Notifications











