‘ఊసరవెల్లి’ తర్వాత మళ్ళీ మనిద్దరమే చేద్దాం: జూ ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో'ఊసరవెల్లి" షూటింగ్ జరుగుతుండగానే వీరిద్దరి కాంబినేషన్ లో మరో భారీ చిత్రం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్ రెడ్డి తను చేయబోయే నెక్స్ట్ మూవీకి సంబంధించిన లైన్ విన్న ఎన్టీఆర్ ఎంతో ఇన్ స్పైర్ అయిన మన కాంబినేషన్ లోనే ఈ సినిమా చేద్దాం అని ఎన్టీఆర్ అనడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాత ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సబ్జెక్ట్ జూ ఎన్టీఆర్ కు పూర్తి విభిన్నంగా వుంటుందట. 'ఊసరవెల్లి" చిత్రాన్ని ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో పాటు బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ సురేందర్ రెడ్డితోనే ఎన్టీఆర్ సినిమా చెయ్యబోతున్నట్టు సమాచారం.
jr ntr surender reddy oosaravelli boyapati srinu జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి ఊసరవెల్లి బోయపాటి శ్రీను


Click it and Unblock the Notifications