twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జై లవకుశకు బాబీ డమ్మీ డైరెక్టరా?.. మళ్లీ సర్ధార్ గబ్బర్ సింగ్ పరిస్థితేనా?

    By Rajababu
    |

    రాయల్ బెంగాల్ టైగర్‌ చిత్రంతో దర్శకుడిగా మారిన బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ రూపంలో మంచి అవకాశం రావడంతో ఎగిరి గంతేశాడు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో పవన్ కల్యాణ్ అంతా చూసుకోవడంతో డమ్మీ డైరెక్టర్ అనే ముద్ర బాబీ వేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద సర్దార్ గబ్బర్ సింగ్ దారుణమైన పరాజయం పొందడంతో డమ్మీ అనే ట్యాగ్ కొంత ఉపశమనం కలిగించింది. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత బాబీకి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో బూరెల బుట్టలో పడ్డాడనే మాట వినిపించింది. అయితే జై లవకుశ సెట్లో కూడా డమ్మీ డైరెక్టర్ అనే పేరు వినిపిస్తున్నది.

    అప్పుడు పవన్ కల్యాణ్‌దే హవా

    అప్పుడు పవన్ కల్యాణ్‌దే హవా

    సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్ సమయంలో డైరెక్షన్‌తో సహా అన్ని పనులు పవన్ కల్యాణ్ దగ్గరుండి చూసుకొన్నారు. బాబీని పక్కన పెట్టి ఇద్దరు ఘోస్ట్ డైరెక్టర్లను నియమించినట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో బాబీ పరిస్థితి చాలా విపత్కరంగా ఉండేదని, ఓ దశలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయినట్టు సమాచారం. తీరా సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలై అట్టర్ ఫ్లాప్ కావడంతో ఆ ఖ్యాతి అంతా పవన్ కల్యాణ్ ఖాతాలోకే చేరింది. తన వల్ల సినిమా ఫ్లాప్ కాలేదు అనే టాక్‌తో బాబీ మానసిక ఒత్తిడికి దూరమైంది.

    బాబీ చేతిలో అతిపెద్ద ప్రాజెక్ట్

    బాబీ చేతిలో అతిపెద్ద ప్రాజెక్ట్

    సర్దార్ పరాజయం తర్వాత అత్యంత ప్రతిష్థాత్మకంగా రూపొందిస్తున్న జై లవకుశ ప్రాజెక్ట్‌ను బాబీ చేతిలో పెట్టడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న సినిమా భారాన్ని బాబీ మోయగలడా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేశారు. జై లవకుశ చిత్ర షూటింగ్‌లో బాబీపై సాంకేతిక నిపుణులదే పైచేయిగా ఉన్నదట.

    ప్రస్తుతం కెమెరామెన్ మురళీధరన్

    ప్రస్తుతం కెమెరామెన్ మురళీధరన్

    పీకే, 3 ఇడియెట్స్, మొహంజదారో, ఇతర బాలీవుడ్ హిట్ చిత్రాలకు పనిచేసిన మురళీధరన్ జై లవకుశ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో బాబీ విజన్‌ను పక్కన పెట్టి మురళీధరన్ తన ఆలోచనలకు అనుగుణంగా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారనే రూమర్ విస్తృతంగా ప్రచారమవుతున్నది. అంతేకాకుండా స్క్రిప్ట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులుచేయిస్తున్నారట.

    బాబీపై తీవ్ర మానసిక ఒత్తిడి

    బాబీపై తీవ్ర మానసిక ఒత్తిడి

    కనీసం రెండు చిత్రాలకు పూర్తిస్థాయిలో పనిచేసిన అనుభవం లేని బాబీ ఈ వ్యవహారాలతో ఒత్తిడికి లోనవుతున్నారట. బాబీ పరిస్థితి చూసి ఎన్టీఆర్ కూడా దర్శకత్వ శాఖలో వేలుపెడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమా హిట్ అయితే బాబీ పరిస్థితి భలే ఉంటుంది. ఫ్లాప్ అయితే మళ్లీ అయో పాపం అనే జాలి చూపించడం ఖాయం అనే మాట వినిపిస్తున్నది.

    డమ్మీ డైరెక్టర్ ముద్ర మారేదెలా..

    డమ్మీ డైరెక్టర్ ముద్ర మారేదెలా..

    పెద్ద నటులను హ్యాండిల్ చేసే సత్తా ఉన్న దర్శకుల్లో బాబీ ఒకరు. ఆయనకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే బ్రహ్మండంగా రాణిస్తారనే అభిప్రాయం సినీ వర్గాల్లో ఉన్నది. ప్రస్తుత పరిస్థితులను నుంచి బయటపడి డమ్మీ డైరెక్టర్ అనే ముద్ర నుంచి బయటపడకపోతే బాబీకి కెరీర్ పరంగా పెద్ద ముప్పు తప్పదనే వాదన కూడా ఉంది.

    English summary
    In the case of ‘Sardaar Gabbar Singh’, Bobby served just as a dummy director as Pawan himself took care of everything including direction. Bobby surprised everyone by grabbing the opportunity to direct an NTR in ‘Jai Lava Kusa’. Rumor is that NTR and film’s cinematographer Muraleedharan suggesting changes to Bobby’s vision and instead conceiving their own version.. An inexperienced and under-pressure Bobby is rumored to be reluctantly obliging to the fingering of NTR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X